Dhanush: ‘సార్‌’.. పనిలో దిగారు

ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంయుక్తా మేనన్‌  కథానాయిక. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ

Updated : 08 Jan 2022 07:23 IST

నుష్‌ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంయుక్తా మేనన్‌  కథానాయిక. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం.. శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని ధనుష్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్లోని స్టిల్‌ను అభిమానులతో   పంచుకున్నారు. ఈ ఫొటోలో ఆయన ఫార్మల్‌ దుస్తుల్లో చాలా సింపుల్‌గా కనిపించారు. విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు  సమాచారం. ఇది తమిళంలో ‘వాతి’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: దినేష్‌ కృష్ణన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు