Updated : 13 Aug 2022 18:15 IST

Dhanush: మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం: ధనుష్‌

హైదరాబాద్‌: ‘మనల్నే మనం తక్కువ అంచనా వేసుకుంటున్నామనుకుంటా. మనం మంచి లెవల్‌లోనే ఉన్నాం’ అంటున్నారు ధనుష్‌ (Dhanush). ఆయన కథానాయకుడిగా రూపొందించిన చిత్రం ‘తిరుచిత్రాంబళం’. మిత్ర ఆర్‌. జవహర్‌ దర్శకుడు. తెలుగులో ‘తిరు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఇందులో ధనుష్‌ పండు అలియాస్‌ తిరు ఏకాంబరం అనే యువకుడి పాత్ర పోషించారు. డెలివరీ బాయ్‌గా పనిచేసే పండు అనూష(రాశీఖన్నా), రజనీ(ప్రియా భవానీ శంకర్‌)లలో ఎవరిని ప్రేమించాడు? ఇందుకోసం అతడి స్నేహితురాలు శోభన(నిత్యామేనన్‌)ఎలా సహకరించింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫీల్‌గుడ్‌మూవీగా ‘తిరు’ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఆగస్టు 18న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని