‘దీపికా నీ గురించి రాయడానికి నాకు లేదు ఓపిక’

కంటెస్టెంట్ల డ్యాన్సులతోపాటు సుధీర్‌, ఆది, ప్రదీప్‌ కామెడీతో ఆద్యంతం అలరించే డ్యాన్సు కార్యక్రమం ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’. ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలై వినోదం పంచుతోంది.

Published : 03 Jul 2021 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు సుధీర్‌, ఆది, ప్రదీప్‌ కామెడీతో ఆద్యంతం అలరించే డ్యాన్స్ షో ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’. ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలై వినోదం పంచుతోంది. ఇందులో.. కంటెస్టెంట్లు అభి, కార్తీక్‌ తమ డ్యాన్స్‌తో న్యాయ నిర్ణీతల మనసు గెలుచుకున్నారు. రష్మి, దీపికా పిళ్లై, సుధీర్‌, ఆది, పూర్ణ సరదాగా స్టెప్పులేసి సందడి చేశారు. ఇదంతా ఒకే. కానీ, ప్రేమలేఖ ఏంటి? అనుకుంటున్నారా? అదేంటంటే.. ఈ షోలో టీం లీడర్లుగా వ్యవహరిస్తోన్న సుధీర్‌, ఆదిల టాస్క్‌ అది. ఇద్దరూ పెన్నూ పేపరు పట్టుకుని తమ భావాల్ని అక్షరీకరించారు. ‘దీపికా దీపికా నీ గురించి రాయడానికి నాకు లేదు ఓపికా’ అంటూ దీపికని, ‘ప్రియ.. నిన్ను చూడగానే పడిపోయా’ అని ప్రియమణిని ఇంప్రెస్‌ చేసేందుకు ప్రయత్నించాడు ఆది. మరి సుధీర్‌ ఎవరి కోసం ప్రేమలేఖ రాశాడో మాత్రం ఇంకా బయటపెట్టలేదు. ఆ సంగతి తెలుసుకోవాలంటే జులై 7 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోతో ఆనందించండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని