Dhee 14: ఇటు ‘గబ్బర్‌సింగ్‌’, అటు ‘సమరసింహారెడ్డి’.. డ్యాన్స్‌ అదిరే!

‘ఢీ 14’ ప్రోమో. ఈ వారం ఎవరెవరు ఎలా ఆకట్టుకోబోతున్నారో ఈ వీడియోలో చూసేయండి...

Published : 22 Feb 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన డ్యాన్స్‌ షో ‘ఢీ’. 13 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం ‘ది డ్యాన్సింగ్‌ ఐకాన్‌’ (14వ సీజన్‌) పేరుతో కొత్త ప్రతిభను పరిచయం చేసి, ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఎప్పటిలానే ఈ వారం (ఫిబ్రవరి 23) మాంచి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. సంబంధిత ఎపిసోడ్‌ ప్రోమో ఇటీవల విడుదలై, నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్‌లో ‘గబ్బర్‌సింగ్‌’, ‘సమరసింహారెడ్డి’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ పాటల పెర్ఫామెన్స్‌ ప్రత్యేకంగా నిలవనున్నట్టు తెలుస్తోంది. వీటిని ప్రదర్శించిన కంటెస్టెంట్‌లకు న్యాయనిర్ణీతలు ప్రియమణి, నందితా శ్వేత, జానీ మాస్టర్‌సహా షోలో ఉన్నవారంతా ఫిదా అయ్యారు. ఆది తన పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించాడు. రవికృష్ణ, నవ్య స్వామిల రొమాంటిక్‌ డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని