Dhee 14: అటు అదిరే డ్యాన్స్‌లు.. ఇటు ఆది పంచ్‌లు!

‘ఢీ 14’ ప్రోమో.. అదిరే డ్యాన్స్‌లు, హైపర్‌ ఆది పంచ్‌లతో ఈవారం అలరించేందుకు సిద్ధమైంది.

Published : 11 Feb 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వావ్‌ అనిపించే డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌, కడుపుబ్బా నవ్వించే పంచ్‌లతో బుల్లితెర ప్రేక్షకులకు మాంచి వినోదం పంచే కార్యక్రమం ‘ఢీ 14: ది డ్యాన్సింగ్‌ ఐకాన్‌’. ఫిబ్రవరి 16న ప్రసారంకానున్న (ఈటీవీ ఛానల్‌లో) ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. ‘మానవా మానవా ఏమి కోరిక’, ‘ఫీల్ మై లవ్‌’, ‘మన్మథరాజా’ పాటలతో కంటెస్టెంట్లు చేసిన డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌, హైపర్‌ ఆది కామెడీ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్యక్రమ న్యాయనిర్ణేతలు ప్రియమణి, నందిత శ్వేత, జానీ మాస్టర్‌తో కలిసి ఆది చేసిన ‘హగ్‌’ వార్‌ అలరిస్తోంది. ‘ఆది అంటే బొగ్గు అనుకుంటివా.. హగ్‌’ అని ఆది చెప్పిన డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని