Dhee 14: ఢీ 14: సరికొత్త పోటీదారులు.. మెస్మరైజ్‌ చేసే డ్యాన్స్‌లు

భారత్‌లోనే అతి పెద్ద డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ’. ఇప్పటివరకూ 13 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకోగా,

Published : 19 Dec 2021 01:25 IST

హైదరాబాద్‌: భారత్‌లోనే అతి పెద్ద డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ’. ఇప్పటివరకూ 13 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకోగా, ప్రస్తుతం ‘ఢీ 14: డ్యాన్సింగ్‌ ఐకాన్‌’ పేరుతో అలరిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సీజన్‌లో పాల్గొనే కొంతమంది డ్యాన్సర్లను ఇప్పటికే పరిచయం చేశారు. మరికొంతమందిని పరిచయం చేయనున్నారు. ఇందులో భాగంగా డిసెంబరు 22న ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఒక్క టికెట్‌కు నాలుగు సినిమాలు పేరుతో ముందుకు వచ్చిన ఈ సీజన్‌లో జూనియర్స్‌, లేడీస్‌, జోడీ, ఛాంపియన్స్‌ కేటగిరిల్లో చేసిన డ్యాన్స్‌లు అలరిస్తున్నాయి. ఇక కంటెస్టెంట్‌లతో హైపర్‌ ఆది చేసే కామెడీ నవ్వులు పూయిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని