Dheekshith shetty: ఆయన అస్సలు రాజీ పడరు: దీక్షిత్‌ శెట్టి

‘దియా’తో యువతను ఆకట్టుకున్నారు నటుడు దీక్షిత్‌ శెట్టి. కన్నడ పరిశ్రమకు చెందిన ఆయన ‘దసరా’(Dasara)తో తెలుగువారికి పరిచయం కానున్నారు. త్వరలో అది విడుదల కానున్న నేపథ్యంలో ఆ సినిమా విశేషాలు పంచుకున్నారు.

Published : 12 Mar 2023 15:31 IST

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని (Nani) నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) కథానాయిక. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టి (Dheekshith shetty) విలేఖరుల సమావేశంలో ‘దసరా’ విశేషాలని పంచుకున్నారు. 

అలా ఎంట్రీ ఇచ్చాను..!

‘‘తెలుగులో నేను ‘మీట్‌ క్యూట్‌’ (Meet Cute) వెబ్‌ సిరీస్‌లో నటించాను. ‘దసరా’ ఆడియన్స్‌ జరుగుతున్నప్పుడు అందులోని ఓ పాత్రకు ‘మీట్‌ క్యూట్‌’కు పనిచేసిన కో-డైరెక్టర్‌ వినయ్‌ నన్ను రిఫర్‌ చేశారు. అలా, ఈ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. నాని కూడా ‘మీట్‌ క్యూట్‌’ చూశారు. అందులోని నా పాత్ర నానికి బాగా నచ్చిందని తెలిశాక.. ఈ సినిమాలో నేను చేయగలననే నమ్మకం పెరిగింది’’

ఇదొక సక్సెస్‌..!

‘‘ఇందులో నా పాత్ర పేరు సూరి. హీరోకి ప్రాణ స్నేహితుడిగా కనిపించనున్నాను. నా పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉండనుంది. ఈ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకున్నాను. షూట్‌ను ఆద్యంతం ఎంజాయ్‌ చేశా. అన్ని రకాల ఎమోషన్స్‌ ఇందులో ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన ఎంటర్‌టైనర్‌లో భాగం కావడమే ఒక విజయంగా నేను భావిస్తున్నాను. క్రైమ్‌, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా, లవ్‌, రొమాంటిక్‌.. ఇలా అన్ని రకాల చిత్రాల్లో నటించాలని ఉంది’’

నాని ఎప్పుడూ ఆలస్యంగా రాలేదు..!

‘‘సుమారు పది నెలలపాటు నానితో కలిసి ప్రయాణించాను. ఈ జర్నీలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది.  ఆయన సెట్‌కు ఎప్పుడూ ఆలస్యంగా రాలేదు. ప్రతిరోజూ పది నిమిషాల ముందే లొకేషన్‌లో ఉండేవారు. సినిమాపై ఆయనకున్న ప్రేమ గొప్పది. ఆయన నుంచి స్ఫూర్తి పొందా’’

ఆయన అస్సలు రాజీ పడరు..!

‘‘కీర్తిసురేశ్‌ నటించిన ‘మహానటి’ చూశాను. ఆమెతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఆమెతో కలిసి పనిచేయడం మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఇక, మా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ప్రతివిషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. అనుకున్న విధంగా షాట్‌ వచ్చేవరకూ రాజీ పడరు’’

అక్కడ వాళ్లూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!  

‘‘దసరా’ సినిమా కోసం కన్నడ ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సినిమాకి భాషతో అడ్డంకుల్లేవు. ‘కేజీయఫ్’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సినిమాని ఇండియన్ సినిమాగా సెలబ్రేట్ చెసుకుంటున్నాం. ‘దసరా’పై కూడా కన్నడలో చాలా క్రేజ్ వుంది. నా విషయానికి వస్తే ‘దియా’ తర్వాత థియేటర్ రిలీజ్ అవుతున్న నా సినిమా ఇదే కావడం ఆనందంగా ఉంది’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు