Dhoomam: ఓటీటీలో ఫహద్‌ ఫాజిల్‌ ‘ధూమం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఫ‌హాద్ ఫాజిల్‌ (Fahad Faasil) కీలక పాత్రలో న‌టించిన మ‌ల‌యాళ(Malayalam) మూవీ ధూమం. ఇప్పటికే ఓటీటీ వేదిక యాపిల్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

Published : 07 Jul 2024 00:03 IST

హైదరాబాద్‌: వైవిధ్యమైన చిత్రాలు, పాత్రలు ఎంచుకుంటారు నటుడు ఫ‌హాద్ ఫాజిల్‌(Fahad Faasil). ఆయన కీలక పాత్రలో న‌టించిన మ‌ల‌యాళ (Malayalam) మూవీ ధూమం. అపర్ణ బాలమురళి కథానాయిక.
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై సామాజిక సందేశంతో ఇవ్వడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇప్పటికే ఓటీటీ వేదిక యాపిల్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ పంచుకుంది.

కథేంటంటే.. అవినాష్ (ఫ‌హాద్ ఫాజిల్‌) ఓ సిగ‌రెట్ కంపెనీలో సేల్స్ హెడ్‌. త‌న తెలివితేట‌లు, మార్కెటింగ్ స్ట్రాట‌జీస్‌తో కంపెనీ అమ్మ‌కాల్ని చాలా పెంచుతాడు. సిగ‌రెట్ కంపెనీ ఎమ్‌డీ సిద్ధార్థ్ అలియాస్ సిధ్ (రోష‌న్ మాథ్యూ) అవినాష్‌ను ఎంప్లాయ్‌లా కాకుండా స్నేహితుడిలాగే భావిస్తుంటాడు. సిద్దార్థ్‌తో విభేదాల కార‌ణంగా ఉద్యోగానికి అవినాష్ రాజీనామా చేస్తాడు. ఆ త‌ర్వాత రోజు త‌న భార్య దియాతో (అప‌ర్ణ బాల‌ముర‌ళి) అవినాష్‌ క‌లిసి కారులో వెళ్తుండగా అత‌డిపై ఓ ముసుగు వ్య‌క్తి ఎటాక్ చేసి డ్ర‌గ్ ఇంజెక్ష‌న్ ఇస్తాడు.

ఆ డ్ర‌గ్ మ‌త్తు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌రికి అవినాష్ ఓ కొండ ప్రాంతంలో ఉంటాడు. అత‌డి భార్య దియా శ‌రీరంలో ఓ మైక్రో బాంబ్ ఫిక్స్ చేశాన‌ని, అది పేల‌కుండా ఉండాలంటే తాము చెప్పింది చేయాల‌ని ఓ అప‌రిచితుడు అవినాష్‌ను ఫోన్‌లో బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరి ఫోన్‌లో త‌న‌ని బెదిరిస్తోన్న అప‌రిచితుడి ఆచూకీని అవినాష్ ఎలా క‌నిపిపెట్టాడు? ఆ ట్రాప్ నుంచి అత‌డు ఏ విధంగా బ‌య‌ట‌ప‌డ్డాడు? త‌న భార్య దియాను అవినాష్‌ కాపాడుకున్నాడా? సిగ‌రెట్ కంపెనీ సేల్స్ పెంచుతూ తాను చేస్తోంది ఉద్యోగం మాత్ర‌మే అని భావించిన అవినాష్ త‌న త‌ప్పును ఏ విధంగా గ్ర‌హించాడు? అన్న‌ది ‘ధూమం’ క‌థ‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని