Dhruv: కబడ్డీ గణేశన్ జీవిత కథలో విక్రమ్ తనయుడు
కబడ్డీ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత మానతి గణేశన్ జీవితం ఆధారంగా సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.
కబడ్డీ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత మానతి గణేశన్ జీవితం ఆధారంగా సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో మానతి గణేశన్ పాత్రను విక్రమ్ (Vikram) తనయుడు ధృవ్ (Dhruv) పోషించనున్నారు. ఆయనకిది నాలుగవ చిత్రం. ఆ పాత్రకు న్యాయం చేసేలా ఆయన కబడ్డీ శిక్షణ తీసుకుంటున్నారు. పూర్వ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో మొదలు కానుంది. దర్శకుడు మారీ మాట్లాడుతూ..‘మానతి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. దగ్గరి బంధువైన మనతి గణేశన్ జీవితాన్ని సినిమాగా తీయాలని ఉండేది. దీంతో ఆ కోరిక తీరనుంది’ అని అన్నారు. పా రంజిత్ నీలం ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర విశేషాలను మరికొద్ది రోజుల్లో చిత్రబృందం ప్రకటించనుంది. ఈ సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకుంటున్నట్లు ధృవ్ కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఉదయ్‌నిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ‘మామన్నన్’ అనే సినిమా షూటింగ్‌లో మారీ బిజీగా ఉన్నారు. ఏఆర్ రెహామాన్ బాణీలు సమకుర్చగా, యుగభారతి సాహిత్యాన్నందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ