Janhvi Kapoor: విజయ్‌ దేవరకొండతో స్వయంవరం.. జాన్వి కామెంట్‌

విజయ్ దేవరకొండతో స్వయంవరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి జాన్వికపూర్‌.

Published : 27 Oct 2022 14:07 IST

ముంబయి: ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని, ఎవరితోనూ ప్రేమలో లేనని చెప్పింది బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). ‘మిలీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్వయంవరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా విలేకరి.. ‘‘మీకు ఒకవేళ స్వయంవరం ఏర్పాటు చేస్తే పరిశ్రమ నుంచి ఏ ముగ్గురు హీరోలు అందులో పాల్గొనాలని అనుకుంటున్నారు’’ అని ప్రశ్నించాడు. దానిపై జాన్వి స్పందిస్తూ.. ‘‘రణ్‌బీర్‌, టైగర్‌’’ అని బదులిచ్చింది.

‘‘రణ్‌బీర్‌కు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. అలాంటప్పుడు ఆయన పేరు చెప్పకూడదు. సింగిల్‌ స్టేటస్‌లో ఉన్న స్టార్స్‌ పేర్లు చెప్పండి. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)’’ అంటూ విలేకరి రౌడీ పేరుని సూచించగా.. ‘‘ఆయనకు ప్రాక్టికల్లీ పెళ్లి అయిపోయింది’’ అని నవ్వుతూ జాన్వి సమాధానం చెప్పింది. మరోవైపు, ఒకవేళ తన పేరు జాన్వి కాకపోతే లైలా అని పిలిపించుకునేదాన్ని అని, కానీ తన జీవితంలో మజ్ను ఎవరూ లేరని అంది. దక్షిణాది హీరోలు అందరితో, ముఖ్యంగా ఎన్టీఆర్‌తో తాను స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని