Salman Khan: బిగ్‌బాస్.. రూ.1000 కోట్ల పారితోషికంపై స్పందించిన సల్మాన్
బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్. సుమారు 15 సీజన్లుగా ప్రేక్షకులను అలరించిన ఈ రియాల్టీ షో సరికొత్త...
ముంబయి: బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్. సుమారు 15 సీజన్లుగా ప్రేక్షకులను అలరించిన ఈ షో సరికొత్త సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ మీడియా ముందుకు వచ్చారు. ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించినందుకు తాను రూ.1000 కోట్లు తీసుకున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు.
‘‘నా పారితోషికం గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను రూ.1000 కోట్లు రెమ్యునిరేషన్ తీసుకొని ఉంటే ఇక జీవితంలో పని చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటా. ఎందుకంటే నాకు న్యాయవాదుల వంటి అనేక ఇతర ఖర్చులు ఉన్నాయి. అవి నాకెంతో అవసరం. మీరు చెప్పే ఈ మొత్తంలో.. నా సంపాదన నాలుగో వంతు కూడా ఉండదు. మీడియాలో వచ్చే ఈ వార్తలను ఆదాయపు పన్ను, ఈడీ కూడా చదువుతుంది’’
‘‘గతంలో చాలాసార్లు విసిగిపోయి.. ఇకపై ఈ షోని హోస్ట్ చేయలేనని చెప్పేశాను. వాళ్లకు వేరే ఛాయిస్ లేక మళ్లీ నన్నే సంప్రదించారు. ఒకవేళ ఛాయిస్ ఉండుంటే నన్నెప్పుడో మార్చేసేవాళ్లు. హౌస్‌లో ఉన్న సభ్యులు కొన్నిసార్లు మితిమీరి వ్యవహరించినప్పుడు నేను మధ్యలో కలగజేసుకోక తప్పదు. పలు సందర్భాల్లో సహనాన్ని కోల్పోయాను. ప్రేక్షకులకు అసలేమైందో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్లు పూర్తి ఎపిసోడ్‌ని చూడరు. కేవలం ఎడిట్ చేసిన వెర్షన్ మాత్రమే చూస్తారు. బిగ్‌బాస్‌లో వచ్చే గొడవలు, విమర్శలు నన్నెప్పుడూ ఇబ్బందిపెట్టలేదు. ఎందుకంటే నాకు వేరే సమస్యలున్నాయి’’ అని సల్మాన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్