Kriti Sanon: కృతిసనన్‌ రిలేషన్‌షిప్‌పై వరుణ్‌ధావన్‌ వైరల్‌ కామెంట్స్‌

ఓ స్టార్‌ హీరో కృతిసనన్‌ని ప్రేమిస్తున్నారంటూ బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. ‘భేదియా’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న వరుణ్‌ తన కోస్టార్‌ కృతి రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 28 Nov 2022 11:47 IST

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కృతిసనన్‌ (Kriti Sanon) రిలేషన్‌షిప్‌పై నటుడు వరుణ్‌ధావన్‌ (Varun Dhawan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్‌ హీరో ఆమెను ప్రేమిస్తున్నారని ఆయన చెప్పారు. ‘భేదియా’ ప్రమోషన్స్‌లో భాగంగా బీటౌన్‌ రియాల్టీ షోలో పాల్గొన్న ఆయన.. ‘‘కృతిసనన్‌ పేరు నా జాబితాలో లేదు. ఎందుకంటే ఆమె పేరు మరొకరి హృదయంలో ఉంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబయిలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణెతో కలిసి షూట్‌లో ఉన్నాడు’’ అని చెప్పాడు. వరుణ్‌ వ్యాఖ్యలు అంతటా వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన పలువురు బీటౌన్‌ నెటిజన్లు వరుణ్‌ మాట్లాడుతున్నది ప్రభాస్‌ గురించేనని అంటున్నారు. ఈ మేరకు ప్రభాస్‌ పేరు నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరోవైపు ఈ విషయంపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సినిమా ప్రమోషన్‌ కోసం మా అన్న పేరుని ఇంతలా వాడుతున్నారేంటి?’ అంటూ మండిపడుతున్నారు.

బీటౌన్‌ భారీ ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌’ కోసం ప్రభాస్‌-కృతిసనన్‌ కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతిసనన్‌ నటించారు. ఈ సినిమా టీజర్‌ విడుదలైన నాటి నుంచి వీరిద్దరి గురించి బాలీవుడ్‌లో వరుస కథనాలు వస్తున్నాయి. ప్రభాస్‌ అంటే తనకిష్టమని, ఆయన్ని అభిమానిస్తున్నానంటూ పలు ఇంటర్వ్యూల్లో కృతి చెప్పడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్‌ ధావన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌ కె‌’ షూట్‌లో బిజీగా ఉన్నారు. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన దీపికా పదుకొణె సందడి చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని