Priyanka Chopra: నేను ‘మిస్ వరల్డ్’ అందుకున్న వేళ.. నిక్ వయసు ఏడేళ్లు : ప్రియాంకా చోప్రా
తన తదుపరి ప్రాజెక్ట్ ‘లవ్ అగైన్’ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra). తాజాగా ఆమె తన భర్త గురించి ఓ విషయాన్ని తెలిపారు.
ఇంటర్నెట్‌డెస్క్: నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), ఆమె భర్త నిక్ జొనాస్ కంటే వయసు పరంగా పెద్దదనే విషయం విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పదేళ్ల వ్యత్యాసం ఉంది. ఇదే విషయంపై తాజాగా ప్రియాంక మాట్లాడారు. తాను ప్రపంచ సుందరిగా కిరీటం గెలుపొందినప్పుడు నిక్ ఏడేళ్ల పిల్లాడని ఇది చెప్పడానికి వింతగా ఉందని ఆమె అన్నారు.
‘‘నిక్‌ని వివాహం చేసుకున్న తర్వాత వాళ్లమ్మ నాతో ఒక విషయాన్ని చెప్పారు. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ప్రపంచ సుందరిగా కిరీటం గెలుపొందినప్పుడు నా వయసు 17 ఏళ్లు. లండన్ వేదికగా జరిగిన ఆ పోటీల్లో నేను పాల్గొన్నాను. అప్పుడు నేనింకా చిన్నపిల్లనే. ఏం చేస్తున్నానో, నా గురించి బయటవాళ్లు ఏం అనుకుంటున్నారో కూడా తెలియదు. 2000లో జరిగిన ఆ పోటీలను మా మావయ్య- అత్తయ్య టీవీలో చూశారట. నేను టైటిల్ గెలుపొందిన క్షణాలు తనకింకా గుర్తేనని ఆమె నాతో చెప్పారు. అయితే అప్పుడు నిక్ వయసు 7 ఏళ్లు అంట. ఇంట్లో వాళ్లతోపాటు తను కూడా టీవీ ముందు కూర్చొని నన్ను చూశాడట. తలచుకుంటే వింతగా ఉంది. విధి మా ఇద్దర్నీ కలిపింది. మేము కలవాలని రాసిపెట్టి ఉంది. అందుకే వయసుపరంగా ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ మేమిద్దరం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. నిక్‌తో రిలేషన్‌లోకి వెళ్లడానికి ముందు నేను ఎంతోమందితో డేట్ చేశాను. అలాగే నిక్‌కు సైతం కొన్ని రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. వాటి గురించి నేను పట్టించుకోలేదు. గతాన్ని గురించి ఆలోచించడం నాకు నచ్చదు. భవిష్యత్తు కోసం అడుగులు వేయడమే మా ఇద్దరికీ ఇష్టం’’ అని ప్రియాంక వివరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KCR: ఇకపై దివ్యాంగులకు రూ.4,116 పింఛన్ : కేసీఆర్
-
India News
Sanjay Raut: నన్ను, నా సోదరుడినీ చంపేస్తామని బెదిరింపులు.. సంజయ్ రౌత్
-
Sports News
WTC Final: తొలుత రహానె.. మరోసారి శార్దూల్.. సేమ్ బౌలర్
-
Crime News
Shamshabad: బండరాయితో కొట్టి.. కారు కవర్లో చుట్టి.. అప్సర హత్య కేసులో కీలక వివరాలు
-
General News
Palnadu: పోస్టుమార్టానికీ లంచం !.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
-
Movies News
Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. సాయం చేస్తామన్న ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి