Samantha: ఆ సినిమా అవకాశం కోల్పోయి.. ‘ఏమాయ చేసావె’ చేసిన సమంత!
‘ఏమాయ చేసావె’ సినిమాకంటే ముందు సమంత మరో చిత్రానికి ఆడిషన్ ఇచ్చిందనే సంగతి మీకు తెలుసా? అది ఏ సినిమా? ఆ దర్శకుడు ఎవరంటే?
ఇంటర్నెట్ డెస్క్: సమంత (Samantha) తొలి చిత్రం ఏదంటే? ఆమె అభిమానులే కాదు సినీ ప్రియులంతా ‘ఏమాయ చేసావె’ (Ye Maaya Chesave) అని ఠక్కున సమాధానమిస్తారు. తొలి పరిచయంలోనే తన నటనతో అంతగా ఆకట్టుకుందామె. ఆ సినిమాకంటే ముందు ఆమె మరో చిత్రానికి ఆడిషన్ ఇచ్చారనే సంగతి మీకు తెలుసా? ‘మనీ’, ‘మనీ మనీ’, ‘సిసింద్రీ’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు.. శివ నాగేశ్వరరావు. 2009లో కొత్త నటులతో ఆయన.. ‘నిన్ను కలిశాక’ (Ninnu Kalisaka) అనే సినిమా తెరకెక్కించారు. ఆ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం సమంతనూ ఆయన ఆడిషన్ చేశారట. ఆమె ఆడిషన్ చాలా బాగుందని, అయితే పారితోషికం ఎక్కువగా అడిగారని, అది తమ సినిమా బడ్జెట్‌పై ప్రభావం చూపుతుందనే కారణంతో హీరోయిన్‌గా తీసుకోలేదని శివ నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పుడే ఆమె అద్భుతంగా పెర్ఫామ్ చేసిందని ఆయన ప్రశంసించారు.
అలా ఆ అవకాశం మిస్ అయిన సమంత.. ‘ఏమాయ చేసావె’ సినిమాతో తెరంగేట్రం చేసింది. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలై సంచలనం సృష్టించింది. తొలి చిత్రమే సూపర్‌హిట్‌కావడంతో సమంతకు వరుస అవకాశాలు వచ్చాయి. అటు అగ్ర కథానాయకులతో, ఇటు యంగ్ హీరోలతో ఆడిపాడి తనదైన ముద్ర వేసింది. ఆమె తాజా చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam) ఇటీవల విడుదలై సందడి చేస్తోంది. విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘ఖుషి’ (Kushi) సెప్టెంబరు 1న విడుదల కానుంది. మరోవైపు, ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌లో ఆమె నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Delhi Robbery: ₹ 1400 పెట్టుబడితో ₹ 25 కోట్లు కొట్టేద్దామనుకున్నారు
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన