Tollywood: నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. గడువు ముగిసినా నిర్మాతల మండలికి ఎన్నికలు జరపడం లేదంటూ శనివారం ఉదయం...

Updated : 24 Sep 2022 16:47 IST

హైదరాబాద్‌: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. గడువు ముగిసినా నిర్మాతల మండలికి ఎన్నికలు జరపడం లేదంటూ శనివారం ఉదయం పలువురు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆందోళనకు దిగారు. ప్రస్తుత అధ్యక్షుడు సి.కల్యాణ్ నియంతృత్వ ధోరణి వల్ల నిర్మాతల మండలిలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఎప్పటికప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తూ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా నిర్మాతల మండలిలో సర్వసభ్య సమావేశాలు జరపడం లేదని, సభ్యులకు లెక్కలు చూపించడం లేదని ఆరోపించారు. వెంటనే నిర్మాతల మండలి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అవసరమైతే న్యాయపోరాటనికి కూడా దిగుతామని వారు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని