Dil Raju: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు దిల్‌రాజు కానుకలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బృందానికి దిల్‌రాజు అభినందనలు తెలిపారు. ‘ఆస్కార్‌’ అవార్డును సొంతం చేసుకోవడంపై  హర్షం వ్యక్తం చేసిన ఆయన టీమ్‌లోని ప్రధాన సభ్యులకు కానుకలు అందజేశారు.

Published : 23 Mar 2023 00:13 IST

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డును గెలుపొంది.. తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలకు వ్యాపింప చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌కు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) అభినందనలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ తరఫు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందానికి ప్రత్యేకంగా కానుకలు అందజేశారు. గ్లోబ్‌, అభినందన పత్రం, ‘నాటు నాటు’ స్టెప్పు ఫొటో, క్లాప్‌ బోర్డు, మూవీ రీల్‌.. ఇలా సినీ పరిశ్రమను ప్రతిబింబించేలా ఈ గిఫ్ట్‌ను స్పెషల్‌గా డిజైన్‌ చేయించారు. ఈ మేరకు శిరీష్‌, హన్సిత, హర్షిత్‌తో కలిసి.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి, దానయ్య, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌లకు దిల్‌రాజు గిఫ్ట్స్‌ అందజేసి.. కంగ్రాట్స్‌ చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎస్‌.వీ.సీ ట్విటర్‌ ఖాతాలో తాజాగా విడుదలైంది. ఇటీవల జరిగిన ‘ఆస్కార్‌’ వేడుకల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’ విజయం అందుకుని.. అకాడమీ అవార్డును ముద్దాడింది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. రామ్‌చరణ్‌ హీరోగా దిల్‌రాజు ఓ సినిమాని నిర్మిస్తున్నారు. శంకర్‌ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కియారా అడ్వాణీ కథానాయిక.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని