Dil Raju: ఫిల్మ్‌ ఫెడరేషన్‌తో చర్చలు.. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం: దిల్‌రాజు

ఫిల్మ్‌ ఫెడరేషన్‌తో చర్చలు ప్రారంభించామని, సంబంధిత వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌లతో జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  

Published : 24 Jun 2022 15:04 IST

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఫెడరేషన్‌తో చర్చలు ప్రారంభించామని, సంబంధిత వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) అన్నారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ (Telugu Film Chamber), తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌లతో (Telugu Film Federation) జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఫిల్మ్‌ ఫెడరేషన్‌ వారితో ఈ రోజు చర్చలు మొదలుపెట్టాం. ఏ రోజు ఏం మాట్లాడుకున్నామో వాటన్నింటినీ క్రోడీకరించి, చివరి రోజు మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. ఈ రోజు నుంచి షూటింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌. చిన్నా పెద్దా అనే తేడా ఏం లేదు.. నిర్మాతలంతా ఒకటే. ఇప్పుడిక్కడ 20 మంది ఉంటే వారిలో 12మంది చిన్న సినిమాలు నిర్మిస్తున్నవారే. ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. అన్నింటి గురించి ప్రస్తావిస్తున్నాం’’ అని దిల్‌రాజు తెలిపారు.

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికలోకం ఇటీవల నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆందోళనల అనంతరం చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో కార్మికులు, నిర్మాతల మధ్య గురువారం చర్చలు సాగాయి. వేతనాలు ఎంత మేరకు పెంచాలి? విధి విధానాలేంటి? అనే విషయాలపై నిర్మాత దిల్‌రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని చలన చిత్ర వాణిజ్య మండలి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని