నేను భారతీయుడినే.. ఇదిగో రుజువు: దిల్జిత్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు ప్రముఖ గాయకుడు దిల్జిత్‌దోసాంజ్‌ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. రైతుల కోసం ఆయన రూ.కోటి విరాళంగా ప్రకటించడంతో

Updated : 04 Jan 2021 16:03 IST

ముంబయి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు ప్రముఖ గాయకుడు దిల్జిత్‌దోసాంజ్‌ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. రైతుల కోసం ఆయన రూ.కోటి విరాళంగా ప్రకటించడంతో పాటు స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనపై బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌తో పాటు పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. కోటి రూపాయల విరాళం ఇచ్చి కూడా బయటికి చెప్పుకోకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. దీనిపై దిల్జిత్‌ స్పందించారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సకాలంలో పన్ను చెల్లించినందుకు ఆదాయపన్ను శాఖ దిల్జిత్‌ను ప్రశంసిస్తూ ఓ ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేసింది. ఆ పత్రాన్ని దిల్జిత్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ‘‘ఇదిగో నా భారత పౌరసత్వానికి రుజువు. ఇలా తన దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. నిజానికి ఇలా పంచుకోవడం నాకూ ఇష్టం లేదు. కానీ.. పరిస్థితుల వల్ల పంచుకోవాల్సి వస్తోంది. ఇకనైనా ద్వేషాన్ని ప్రచారం చేయడం మానుకోండి’ అని  విమర్శకులను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

 

ఇదీ చదవండి..

కంగన x ఊర్మిళ

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts