
Dimple Hayathi: బాలకృష్ణతో ఆటాపాటా
‘‘జర్ర జర్ర..’’ అంటూ ‘గద్దలకొండ గణేష్’లోని ప్రత్యేక గీతంతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది డింపుల్ హయాతి. ఇటీవలే ‘ఖిలాడి’తో అలరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం గోపీచంద్ సరసన ‘లక్ష్యం2’లో నటిస్తోంది. కాగా, ఇప్పుడీ భామ బాలకృష్ణతో కలిసి స్టెప్పేసే అవకాశం అందుకుంది. బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతముంది. ఈ పాట కోసమే ఇప్పుడు డింపుల్‌ని రంగంలోకి దించింది చిత్ర బృందం. ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో బాలకృష్ణ, డింపుల్‌లపై ఈ పాట చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దీనికి శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నట్లు తెలిసింది. యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Sri Lanka crisis: శ్రీలంకలో ఇంధనానికి టోకెన్లు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత!
-
Sports News
arshdeep: ఉమ్రాన్ ఓకే.. మరి అర్ష్‌దీప్ సంగతేంటి?
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు విశేష స్పందన.. 4 రోజుల్లో 94వేల మంది దరఖాస్తు
-
General News
Andhra news: ‘అమ్మఒడి’లో మరో కుదింపు.. ల్యాప్‌టాప్‌కు బదులు ట్యాబ్‌లు!
-
General News
Telangana news: కలుషిత ఆహారం తిని 128మంది బాలికలకు అస్వస్థత
-
Politics News
Telangana news: ప్రశ్నిస్తే.. రైతులపై కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారు: రేవంత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Russia: 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో రష్యా విఫలం ..!