‘రెడ్‌’ ఐటమ్‌ సాంగ్‌ వీడియో వచ్చేసింది

ఇస్మార్ట్‌ హీరో రామ్‌ పోతినేనితో కలిసి కిషోర్‌ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘రెడ్‌’. ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తోంది. రామ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టింది. గతంలో డించక్‌.. డించక్‌ అంటూ సాగే లిరికల్‌ వీడియో

Published : 01 Feb 2021 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇస్మార్ట్‌ హీరో రామ్‌ పోతినేనితో కలిసి కిషోర్‌ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘రెడ్‌’. ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తోంది. రామ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టింది. గతంలో డించక్‌.. డించక్‌ అంటూ సాగే లిరికల్‌ వీడియో విడుదలై యూట్యూబ్‌లో కుర్రకారును ఊర్రూతలూగించింది. తాజాగా.. ఆ పాటకు సంబంధించిన పూర్తి వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ పాటలో ఎనర్జిటిక్‌స్టార్‌ రామ్‌తో కలిసి హెబ్బా స్టెప్పులేసింది.

కిషోర్‌ తిరుమల, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తాజాగా ‘రెడ్‌’ కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో వీళ్ల ఖాతాలో హ్యాట్రిక్‌ విజయం నమోదైంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. రామ్‌కు జోడీగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ ముగ్గురు భామలు సందడి చేశారు. స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చదవండి..

#BB3 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని