
No Entry Mein Entry: కొనసాగనున్న ‘నో ఎంట్రీ’
సల్మాన్‌ఖాన్, దర్శకుడు అనీస్ బాజ్మీ కలయికలో 2005లో వచ్చిన చిత్రం ‘నో ఎంట్రీ’. హాస్య ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్ ఉంటుందని చాలా రోజులుగా ప్రచారమవుతోంది. తాజాగా దర్శకుడు అనీస్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించాడు. ‘నో ఎంట్రీ మై ఎంట్రీ’ టైటిల్‌తో సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. మొదటి భాగం కంటే ఇందులో రెట్టింపు హాస్యముంటుందని వెల్లడించాడు. సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్‌తో కలిసి బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘నో ఎంట్రీ’లో భాగమైన అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ సీక్వెల్లోనూ కనిపిస్తారు. అనీస్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘భూల్ భులైయా 2’ ప్రేక్షకులను అలరిస్తోంది.
సిద్ధమవుతున్న ‘ఆనంద్’ రీమేక్
రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ నటించిన క్లాసిక్ ఎమోషనల్ డ్రామా ‘ఆనంద్’. 1971లో విడుదలైన ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ‘ఆనంద్’ నిర్మాత ఎన్.సి సిప్పీ మనవడు సమీర్ రాజ్ సిప్పీ, విక్రమ్ ఖాఖర్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..‘కొత్త కథల కోసం ఎదురుచూడడం కన్నా ఇప్పటికే వచ్చిన క్లాసిక్స్ నుంచి కథలు ఎంపిక చేసుకోవాలనుకున్నాం. అందులో భాగంగానే ‘ఆనంద్’ను ఎంచుకున్నాం. ఈ తరానికి ఇలాంటి కథ గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నా’మన్నారు. మాతృకలో క్యాన్సర్‌తో బాధపడుతూ జీవిత చివరి అంచుల్లో ఉన్న ‘ఆనంద్’ అనే వ్యక్తిగా రాజేశ్ ఖన్నా నటించారు. అతడికి వైద్యునిగా అమితాబ్ కనిపిస్తారు. ఈ నేపథ్యంలో తన చివరి రోజుల్లో ఆనంద్ ఎలా గడిపాడు. తను జీవితానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటన్నది కథ. ఈ రీమేక్‌కు దర్శకుడు, ఇతర నటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.
వెబ్‌సిరీస్‌గా గాంధీ పోరాటం
భారత స్వాతంత్య్ర సంగ్రామ సారధి, జాతిపిత మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ జీవిత చరిత్ర వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. ‘స్కామ్ 1992’ ఫేం ప్రతీక్ గాంధీ ఇందులో టైటిల్ పాత్రలో కనిపిస్తాడు. స్వాతంత్య్ర సంగ్రామాన్ని గాంధీ కోణం నుంచి తెరకెక్కించడమే ఈ సిరీస్ ప్రధాన ఉద్దేశమని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ - ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ది వరల్డ్’ పుస్తకాలను ఆధారం చేసుకుని సిరీస్ ఉంటుందని వివరించింది. గాంధీ దక్షిణాఫ్రికాకు వెళ్లడం దగ్గర నుంచి మహాత్ముడిగా మారడం తదనంతర పరిణామాలను చూపించనున్నారని తెలుస్తోంది. దేశ విదేశాల్లోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని అత్యున్నత నిర్మాణ విలువలతో సిరీస్‌ను రూపొందిస్తామని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్..
-
General News
E-Mobility: టేబుల్ మీద తింటూ.. టేబుల్‌తో సహా ప్రయాణించి..!
-
Politics News
Telangana News: ఆపరేషన్ ఆకర్ష్.. భాజపాలో ఈటలకు కొత్త బాధ్యతలు!
-
India News
Delhi Assembly: 66శాతం పెరిగిన దిల్లీ ఎమ్మెల్యేల జీతం.. నెలకు ఎంతంటే..?
-
Politics News
Maharashtra: ఉద్ధవ్ వైపే ఉంటానని కన్నీరు పెట్టుకొని.. శిందేకు ఓటేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు