AnilRavipudi: ప్రతి నటుడికీ శిక్షణ అవసరం

‘ప్రతి నటుడికీ శిక్షణ ఎంతో అవసరం’ అని అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ నిర్వహిస్తోన్న మయూఖా టాకీస్‌ నట శిక్షణ కేంద్రంలో తొమ్మిదో బ్యాచ్‌ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 04 Jul 2021 20:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రతి నటుడికీ శిక్షణ ఎంతో అవసరం’ అని అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ నిర్వహిస్తోన్న మయూఖా టాకీస్‌ నట శిక్షణ కేంద్రంలో తొమ్మిదో బ్యాచ్‌ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘కళని దేవుడిచ్చిన వరంగా భావించాలి. నటనలో శిక్షణ అవసరంలేదని చాలా మంది అభిప్రాయపడతారు. కానీ, ప్రతి నటుడికీ శిక్షణ ఎంతో అవసరం. కెమెరా ముందు కనిపించే నటీనటులను నేను దైవంగా చూస్తాను. నా 16 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎప్పుడూ ఎవరితోనూ పరుషంగా మాట్లాడలేదు’ అని తెలిపారు. ‘కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను నటుడిగా మారాల్సి వచ్చింది’ అని మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు రఘుబాబు అన్నారు. తన శిక్షణ కేంద్రం నుంచి ఇప్పటి వరకు 13 మందికి అవకాశాలు లభించాయని, వాళ్లు.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో కథానాయకులుగా నటిస్తున్నారని ఉత్తేజ్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని