Bobby: త్వరలోనే మరో మెగా హీరోతో సినిమా..: దర్శకుడు బాబీ
తాజాగా గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) దర్శకుడు బాబీ(Bobby) సందడి చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే మరో మెగా హీరోతో సినిమా చేయనున్నట్లు స్పష్టం చేశారు.
హైదరాబాద్: ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya) సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు బాబీ(Bobby). చిరు అభిమాలనుకు మాస్ ఎంటర్‌టైనర్‌ను అందించిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా గన్నవరం విమానాశ్రయంలో సందడి చేసిన బాబీ మీడియాతో మాట్లాడారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని హిట్ చేసినందుకు మరోసారి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
‘‘మా సినిమా విడుదలై నాలుగు వారాలవుతున్నా.. ఇప్పటికీ కలెక్షన్‌లు బాగా వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు విదేశాల్లోని తెలుగు వారు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. నా దర్శకత్వంలో నటించడానికి చిరంజీవి అంగీకరించడం నాకు పెద్ద బహుమతితో సమానం. ప్రస్తుతం మా చిత్రబృందమంతా సినిమా విజయోత్సవ సంబరాల్లో ఉంది. మెగా హీరోతో మరో సినిమా చేస్తున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తాను’’ అని చెప్పారు. ఇక పవన్‌కల్యాణ్ గురించి బాబీ మాట్లడుతూ తన మద్దతు ఎప్పటికీ ఆయనకు ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే చిరంజీవి(Chiranjeevi)తో, పవన్ కల్యాణ్‌లతో సినిమాలు తీసిన బాబీ తర్వాత ఏ మెగా హీరోతో పనిచేస్తారా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ‘ఆ మెగా హీరో వైష్ణవ్ తేజ్’ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. బన్నీకి కూడా ఓ కథ వినిపించినట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: బోయింగ్, ఎయిర్‌బస్‌కు పోటీగా చైనా ప్యాసింజర్ విమానం..!
-
India News
wrestlers Protest: పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. దిల్లీలో ఉద్రిక్తత!
-
Movies News
Shaakuntalam: ‘కేన్స్’లో శాకుంతలం మెరుపులు.. స్పందించిన సమంత
-
Health News
అశ్లీల చిత్రాలు తరచూ చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి!
-
Movies News
NTR Centenary Celebrations: ఎన్టీఆర్ స్మరణలో సినీ తారలు.. సోషల్‌మీడియాలో పోస్టులు
-
World News
viral news: లైవ్‌లో అతిగా మద్యం తాగి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతి..!