Ram Charan: ‘RC16’పై అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు.. కథ అద్భుతమన్న విజయ్‌ సేతుపతి

రామ్‌చరణ్ హీరోగా రానున్న ‘RC16’ షూటింగ్‌పై దర్శకుడు అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా కథ గురించి విజయ్‌సేతుపతి మాట్లాడారు. 

Published : 19 Jun 2024 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘RC16’గా ఇది ప్రచారంలో ఉంది. అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి చాలా రోజులైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంపై దర్శకుడు తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు.

హీరో విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజ’ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఆ చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేశారు.  ఈసందర్భంగా ‘RC16’ గురించి విజయ్‌ (Vijay Sethupathi) మాట్లాడుతూ సినిమా స్టోరీ ఎంతో బాగుందని బుచ్చిబాబును ప్రశంసించారు. ‘నాకు ఈ స్టోరీ మొత్తం తెలుసు. విడుదలకు ముందే చెబుతున్నాను ఇది సూపర్‌ హిట్‌ అవుతుంది. కథను అద్భుతంగా రాశారు’ అని అన్నారు. అలాగే దీని షూటింగ్ ఆగస్టులో ప్రారంభించనున్నట్లు బుచ్చిబాబు తెలిపారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే పేరును ఖరారు చేసినట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. షూటింగ్‌ ప్రారంభించే రోజు దీని గురించి ప్రకటన చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.

‘కల్కి’లో అలనాటి నటి.. 18 ఏళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ

ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనున్నారు. స్పోర్ట్స్‌ డ్రామాగా.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు సమాచారం. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తైన తర్వాత రామ్‌చరణ్‌ ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని