Published : 25/01/2021 19:31 IST

‘క్రాక్‌’ రీమేక్‌ చేస్తా: గోపీచంద్‌ మలినేని

హైదరాబాద్‌: సరైన అవకాశం లభిస్తే తప్పకుండా ‘క్రాక్‌’ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి రీమేక్‌ చేస్తానని దర్శకుడు గోపీచంద్‌ మలినేని అన్నారు. మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ‘క్రాక్‌’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించింది. పవర్‌ఫుల్ పోలీస్‌ అధికారిగా రవితేజ కనిపించిన తీరు.. మాస్‌ డైలాగులు.. యాక్షన్‌ సన్నివేశాలు.. ఇలా ఈ సినిమా ఎన్నో విధాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

కాగా, తాజాగా ఈ సినిమా విజయంపై దర్శకుడు గోపీచంద్‌ మరోసారి ఆనందం వ్యక్తం చేశారు. ‘క్రాక్‌’ రీమేక్‌ పై ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘హిందీతోపాటు ఏ భాషలోనైనా రీమేక్‌ చేయడానికి ఈ కథ సరిగ్గా సరిపోతుంది. మంచి అవకాశం లభిస్తే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి రీమేక్‌ చేయాలనే ఆలోచన నాకు ఉంది. రీమేక్‌ ఛాన్స్‌ లభిస్తే బాలీవుడ్‌ నటులతోనే చేస్తా. అజయ్‌దేవ్‌గణ్‌, సల్మాన్‌ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి హీరోలు నటించడానికి ఓకే చెప్తే నేను ఈ ప్రాజెక్ట్‌ను రీమేక్‌ చేస్తాను’ అని గోపీచంద్‌ వివరించారు.

ఇదీ చదవండి

చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని