Allu Arjun: అందుకే అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ అనేది.. బన్నీపై ప్రశంసలు కురిపించిన టాప్ డైరెక్టర్
తాజాగా ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా త్రీడీ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: ‘రుద్రమదేవి’ సినిమాతో హిట్ అందుకొని ఇప్పుడు ‘శాకుంతలం’ (Shaakuntalam)తో పలకరించనున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar). ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మీడియాతో మాట్లాడారు. అల్లు అర్హ (Allu Arha)పై ప్రశంసలు కురిపించిన ఆయన బన్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌కు మాతృభాషపై మమకారం ఎక్కువన్నారు.
‘‘శాకుంతలం’ సినిమాలో భరతుడి పాత్ర చాలా కీలకమైనది. ఆ రోల్‌కు ఎవరైనా స్టార్ కిడ్ అయితే బాగుంటుందనుకున్నాం. ఇన్‌స్టాలో అర్హ ఫొటోలు చూడగానే తనైతే సరిపోతుందనిపించింది. అప్పుడు బన్నీని అడిగాం. ఆయన వెంటనే అంగీకరించారు. అర్హ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తన పాత్ర క్లైమాక్స్‌కు ముందు వస్తుంది. లాస్ట్ 15 నిమిషాలు అల్లు అర్జున్‌ను దింపేసేలా నటించింది’’ అంటూ అర్హపై గుణశేఖర్ పొగడ్తల వర్షం కురింపించారు.
ఇక బన్నీ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘అల్లు అర్జున్ (Allu Arjun) ‘రుద్రమదేవి’ సినిమాలో ఓ పాత్ర చేసి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ‘శాకుంతలం’ సినిమా కోసం అర్హను అడిగిన వెంటనే అంగీకరించాడు. కొవిడ్ సమయంలో వాళ్ల అమ్మాయిని పంపాడు. ఐకాన్ స్టార్‌కు అల్లు అర్జున్ కరెక్ట్‌గా సరిపోతాడు. నటనపరంగానే కాదు.. తన ఆలోచనలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చిన్నతల్లికి ఎంత కష్టం.. అత్యాచారానికి గురై వీధిలో రక్తమోడుతూ సాయం కోరితే..!
-
Byjus Job Cuts: బైజూస్‌లో భారీ ఉద్యోగాల కోత.. కొత్త సీఈఓ ప్రణాళికల ఫలితం!
-
Yash 19: హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్‌తో యశ్.. సంబరపడుతోన్న అభిమానులు..
-
26 ఏళ్ల టెక్ సీఈవో.. నేరగాడి చేతిలో హత్యకు గురై..!
-
Road Accident: రోడ్డు ప్రమాదంలో నలుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల దుర్మరణం
-
Jairam Ramesh : మణిపుర్ వెళ్లేందుకు మోదీకి ఒక్కరోజు కూడా వీలు కాలేదా?: కాంగ్రెస్