Ravi Teja: నొప్పిని లెక్కచేయని రవితేజ.. హరీశ్‌ శంకర్‌ ‘హ్యాట్సాఫ్‌’ పోస్ట్‌

నొప్పిని లెక్కచేయకుండా హీరో రవితేజ పనిలో నిమగ్నమయ్యారు. సంబంధిత ఫొటోను హరీశ్‌ శంకర్‌ షేర్‌ చేస్తూ.. కొనియాడారు.

Published : 14 Jun 2024 22:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పనిలోనే ఆనందాన్ని పొందే నటుల్లో రవితేజ (Ravi Teja) ఒకరు. ఖాళీగా ఉండేందుకు ఏమాత్రం ఇష్టపడరు. పనిపట్ల ఆయనకున్న అంకితభావం ఎలాంటిదో తెలియజేసే ఓ ఫొటోని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) సెట్స్‌లో తీసిన పిక్‌ షేర్‌ చేస్తూ.. ‘‘తీవ్రమైన మెడనొప్పితోనూ రవితేజ అన్నయ్య పని చేస్తున్నారు. మాస్‌ మహారాజ్‌ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌. ప్రతిరోజూ మీరు నాకు స్ఫూర్తినిస్తుంటారు’’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ పోస్ట్‌పై రవితేజ అభిమానులు స్పందించారు. ‘కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత నటించండి’, ‘అన్నా.. ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ కామెంట్లు పెట్టారు. రవితేజ డెడికేషన్‌ గురించి పలువురు నటులు గతంలో మాట్లాడిన క్లిప్పింగ్స్‌ను షేర్‌ చేస్తున్నారు.

‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్‌తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్‌బాబు

‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ తర్వాత రవితేజ- హరీశ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు రవితేజ అభిమాని అనే సంగతి తెలిసిందే. ఈ మూవీలోనూ ఆయన అమితాబ్‌ ఫ్యాన్‌గా కనిపించనున్నారని సమాచారం. ఇది పూర్తవ్వకముందే రవితేజ తన 75వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఈ మూవీతో రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని