Harish Shankar: రవితేజ- హరీశ్‌శంకర్‌ కాంబోలో మరో చిత్రం .. హిస్టరీ రిపీట్‌ అంటూ ట్వీట్‌

‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ తర్వాత నటుడు రవితేజ, దర్శకుడు హరీశ్‌శంకర్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. ట్విటర్‌ వేదికగా హరీశ్‌ ఆ విషయాన్ని వెల్లడించారు.

Published : 05 Apr 2023 00:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో రవితేజ (Ravi Teja)- దర్శకుడు హరీశ్‌శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. తమ గత సినిమాకు పూర్తిభిన్నంగా కొత్త సినిమా ఉండనుంది. ట్విటర్‌ వేదికగా హరీశ్‌శంకర్‌ ఈ వివరాల్ని ప్రకటించారు. ‘‘రవితేజ అన్నయ్యతో కలిసి పనిచేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే. ఈసారి పీరియాడికల్‌ డ్రామాతో. అతి త్వరలోనే మేం హిస్టరీ రిపీట్‌ చేయబోతున్నాం’’ అని హరీశ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రవితేజ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా హరీశ్‌ ట్వీట్‌ చేశారు. ఈ క్రేజీ కాంబోలో గతంలో ‘షాక్‌’(Shock), ‘మిరపకాయ్‌’ (Mirapakay) చిత్రాలొచ్చిన సంగతి తెలిసిందే.

రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెక్కించిన సినిమా ‘రావణాసుర’ (Ravanasura). ఆ చిత్రం ఏప్రిల్‌ 7న విడుదలకానున్న నేపథ్యంలో రవితేజ.. ట్విటర్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ‘హరీశ్‌శంకర్‌తో మరో సినిమా ప్లాన్‌ చేయండి’ అని ఓ ఫ్యాన్‌ కోరాడు. ‘అన్నా హరీశ్‌ శంకర్‌ నిన్నే ఏదో అడుగుతున్నారు’ అని రవితేజ.. హరీశ్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు. దానిపై స్పందించిన ఆయన తమ కాంబోలో మరో చిత్రం వస్తుందని ప్రకటించారు. హరీశ్‌ ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్‌హిట్‌ చిత్రం ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత మరోసారి పవన్‌తో హరీశ్‌ పని చేస్తుండడంతో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో ఆ చిత్రాన్ని అనౌన్స్‌ చేసినా పలు కారణాల వల్ల ఇప్పటికీ ప్రారంభంకాలేదు. అది పూర్తయిన తర్వాత హరీశ్‌- రవితేజ కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని