Harish Shankar: నిజమైన అభిమానులు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటారు: హరీశ్‌ శంకర్‌

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar)కు ఓ అభిమాని లెటర్‌ ఇచ్చారు. దానిని ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు.

Published : 25 Sep 2023 17:25 IST

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే సినీ ప్రముఖుల్లో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar)ఒకరు. నెటిజన్ల ట్వీట్లకు తనదైన శైలిలో సమాధానమిస్తుంటారు. అలాగే సినీ ప్రియుల కోసం సినిమా అప్‌డేట్లు కూడా పంచుకుంటుంటారు. తాజాగా ఆయనకు ఓ అభిమాని ఇచ్చిన లెటర్‌ను ఎక్స్‌లో షేర్‌ చేశారు.

‘ఈరోజు కాఫీ షాప్‌లో ఎవరో అభిమాని నాకు ఈ లెటర్‌ ఇచ్చారు. నిజమైన అభిమానులు ఎప్పుడూ ఇలా స్ఫూర్తినిస్తుంటారు. నేను చేసే పని ఇంకా కష్టపడి చేయడానికి ప్రేరణనిస్తుంటారు’ అని రాసుకొచ్చారు. ఇక ఆ అభిమాని ఇచ్చిన లెటర్‌పై ‘మీ మాస్‌ సినిమాలకు వీరాభిమానిగా.. ‘ఉస్తాద్‌’ సినిమాకు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నాను. మీ పనిని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఆయన పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (ustaad bhagat singh)ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

 విజయ్‌ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్‌ వ్యాఖ్యలు

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌, పోస్టర్లకు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై రానున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజతో హరీశ్‌ శంకర్‌ ఓ సినిమా తీయనున్నారని టాక్‌ వినిపిస్తుంది. అలాగే రామ్‌కు కూడా ఓ స్టోరీ చెప్పినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని