Harish shankar: మీకు కమెడియన్‌గా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది: హరీశ్‌ శంకర్‌

రవితేజ సినిమాలు, హీరోయిన్‌ల ఎంపికపై ఓ ఫిల్మ్‌ క్రిటిక్‌ చేసిన కామెంట్‌పై హరీశ్ శంకర్‌ ఘాటు రిప్లై ఇచ్చారు.

Updated : 19 Jun 2024 15:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సామాజిక మాధ్యమాల వేదికగా జరిగే విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగినవిధంగా స్పందిస్తారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar). ఆ కౌంటర్‌ ఎలా ఉంటుందంటే ఎన్‌కౌంటర్‌ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా అలాంటి ఆసక్తికర సందర్భమే చోటుచేసుకుంది. హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (mr bachchan). భాగ్యశ్రీ  బోర్సే (Bhagyashree Borse) కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీకి సంబంధించి ‘షో రీల్‌’ పేరుతో ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

భారతీయ సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకునే ఓ నెటిజన్ రవితేజ స్క్రిప్ట్‌ సెలక్షన్‌పై వ్యంగ్యంగా స్పందించాడు. ఇది చూసిన హరీశ్‌శంకర్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. ‘రవితేజ స్క్రిప్ట్‌ సెలక్షన్‌ కన్నా కూడా హీరోయిన్‌ ఎంపిక బాగుంటుంది’ అంటూ భాగ్యశ్రీ బోర్సే ఫొటోను పంచుకుంటూ #MrBachchan హ్యాష్‌ట్యాగ్‌ జోడించాడు. ఈ పోస్ట్‌కు హరీశ్ శంకర్‌ స్పందిస్తూ ‘మీ ప్రొఫైల్‌ చూసిన తర్వాత ‘తెలుగు’కు మీరు చివరి నుంచి రెండో ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి మీరు ఇంకా విడుదల కాని, సినిమా స్క్రిప్ట్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీకు నా సినిమాలో కమెడియన్‌గా అవకాశం ఇవ్వాల్సింది. అయినా పర్వాలేదు. మీరు బాగానే నవ్విస్తున్నారు. దీన్ని ఇలాగే కొనసాగించండి. మీ నుంచి ఇలాంటివి మరిన్ని కోరుకుంటున్నా’ అని సమాధానం ఇచ్చారు. మరోవైపు ‘మిస్టర్‌ బచ్చన్‌’ ‘షో రీల్‌ చూస్తుంటే, ఆద్యంతం మాస్‌ యాక్షన్‌ హంగామాగా మూవీని తీర్చిదిద్దుతున్నట్లు  అర్థమవుతోంది.

మిస్టర్‌ బచ్చన్‌ మరో పాట..

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ కోసం పాటలను సిద్ధం చేస్తున్నారు హరీశ్ శంకర్‌. “నీలాకాశం నీడన బిడియాలన్నీ వీడనా… నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేయ్ నా’’ అంటూ సాగే పాట షూటింగ్‌కు సిద్ధమయ్యారు. సాహితీ రాసిన ఈ లిరిక్స్‌ అద్భుతంగా ఉన్నాయంటూ హరీశ్ కితాబిచ్చారు. ‘కెవ్వు కేక’.. ‘అస్మైక యోగ’ వంటి పాటలు ఆయన రాసినవేనంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.  కశ్మీర్‌లో ఈ పాట చిత్రీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని