Harish Shankar: రవితేజ పాటపై ట్రోలింగ్‌.. హరీశ్‌ శంకర్‌ కౌంటర్‌

హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ఈ సినిమాలోని పాటపై వచ్చిన విమర్శపై డైరెక్టర్‌ స్పందించారు.

Published : 11 Jul 2024 12:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ (Ravi Teja) హీరోగా హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్యాడ్‌బరీ యాడ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ‘సితార్‌ సాంగ్‌’ (Sitar Song) (లిరికల్‌ వీడియో)ను ప్రచారంలో భాగంగా చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. సాహిత్యం బాగుందంటూ పలువురు శ్రోతలు నెట్టింట పెట్టిన పోస్ట్‌లపై శంకర్‌ స్పందిస్తూ వారికి థ్యాంక్స్‌ చెప్పారు. మరోవైపు, రవితేజ, భాగ్యశ్రీల మధ్య వయసు వ్యత్యాసాన్ని హైలైట్‌ చేస్తూ.. ‘‘ఫిల్మ్‌మేకర్స్‌ హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఈ పాటలో ఆమె ఫేస్‌ని చూపించే ప్రయత్నం చేయలేదు’’ అని ఒకరు కామెంట్‌ చేశారు. దానిపై హరీశ్‌ స్పందించారు.

ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది: ‘గేమ్‌ ఛేంజర్‌’పై శంకర్‌ కామెంట్స్‌

‘‘మీరు కనుగొన్న దానికి కంగ్రాట్స్‌. మీరు నోబెల్‌ ప్రైజ్‌కు అప్లై చేస్తే బాగుంటుంది. ఇలానే మీ పని కొనసాగించండి. మేం స్వాగతిస్తాం’’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ సొంతం చేసుకుంది. రవితేజ-హరీశ్‌ కాంబోలో ఇంతకుముందు ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ చిత్రాలొచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని