Prabhas: శిక్షణ పూర్తవకుండానే ప్రభాస్ దూకేశాడు..!: దర్శకుడు జయంత్
ప్రభాస్ నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్’ విడుదలై 20 ఏళ్లు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయంత్ పలు విశేషాలు పంచుకున్నారు.
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నట ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్’ (Eeswar) 2002 నవంబరు 11న విడుదలై సందడి చేసింది. ఆ సినిమా చిత్రీకరణ జ్ఞాపకాలను దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ తనను నమ్మి నటనలో దూకాడని జయంత్ అన్నారు. ‘‘నేను మహేశ్‌బాబుతో ‘టక్కరి దొంగ’ సినిమా చేస్తున్న సమయంలో.. ఓ చిత్రం చేస్తానని నిర్మాత అశోక్ కుమార్‌కు మాటిచ్చా. స్వతహాగా నాకు ప్రేమకథలంటే ఇష్టం. అప్పట్లో ఆ స్టోరీలదే ట్రెండ్. అయితే, కేవలం లవ్కాదు అందులో యాక్షన్కూ చోటివ్వాలనేది నా ఆలోచన. దాన్ని తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కించాలని నేనూ అశోక్ నిర్ణయించుకున్నాం. నేను రాసుకున్న కథకు లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు సరిపోడు. అందుకే మాస్ లుక్ ఉండే కొత్త హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఆ క్రమంలో కృష్ణంరాజుగారి సోదరుడి అబ్బాయి ప్రభాస్ అనే కుర్రాడు సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని తెలిసింది’’
ఫొటోలు చూడగానే హీరో మెటీరియల్ అనుకున్నా. ఓ హోటల్లో ఆయన్ను కలిశా. అతడు స్టార్ అవుతాడనే నమ్మకం అప్పుడే కలిగింది. ఇతడే మనకు కావాల్సిన హీరో అని ఫిక్స్ అయ్యా. ‘నా ట్రైనింగ్ ఇంకా పూర్తికాలేదండి. నాకు కొంత సమయంకావాలి’ అని ప్రభాస్ కోరాడు. నీకు శిక్షణ అవసరం లేదు.. నువ్వు చేస్తున్నావ్ అని సినిమా బేసిక్ లైన్ చెప్పగానే పూర్తి కథ వినకుండా నన్ను నమ్మి ‘ఈశ్వర్’ కథలో దూకాడు’’ అని జయంత్ వివరించారు. ఈ క్యారెక్టర్‌కు ప్రభాస్‌ను ఎంపిక చేయకముందు సినీ నేపథ్యమున్న ఓ యువకుడి ఫొటోలనూ పరిశీలించారట. ఇప్పుడతను పెద్ద స్టార్ అయ్యాడని చెప్పిన జయంత్.. ఆ హీరో వివరాలు బయటపెట్టలేదు. (#20YearsForPrabhas)
అలా మొదలై.. ఇలా ఎదిగి
ఎమ్మెల్యే కూతురిని పేదింటి కుర్రాడు ప్రేమిస్తే ఏం అవుతుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ హీరోయిజం ఆకట్టుకుంది. శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలోని ‘దిందిరన’, ‘కోటలోని రాణి’, ‘అమీర్‌పేటకు ధూల్‌పేటకు’ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ప్రభాస్ రెండో సినిమాగా ‘రాఘవేంద్ర’ను ఎంపిక చేసుకున్నారు. మూడో చిత్రం ‘వర్షం’తో సూపర్‌హిట్ అందుకున్నారు. ‘ఛత్రపతి’, ‘బిల్లా’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మిర్చి’, ‘బాహుబలి’.. ఇలా విభిన్న కథలతో ఆయన సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. ఈ ఏడాది ‘రాధేశ్యామ్’తో అభిమానులను కాస్త నిరాశ పర్చిన ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్టు కె’ (వర్కింగ్ టైటిల్)లతో వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్‌కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్‌దత్‌ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. -
Mahesh babu: ‘మురారి’ శాపం వెనుక స్టోరీ ఇది.. క్లైమాక్స్‌లో ఆ పాట వద్దన్న కృష్ణ..!
మహేశ్‌బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మురారి’. సోనాలి బింద్రే కథానాయిక. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. -
Jayamalini: జయమాలిని కోసం కత్తితో బెదిరింపు!
సినీ తారలను చూసేందుకు జనం విరగబడి రావడం, వారితో సెల్ఫీల కోసం పోటీ పడటం మనం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అలనాటి నృత్యతార జయమాలినికి (Jayamalini) ఎదురైందట. -
Temper: ఆర్. నారాయణమూర్తి ‘టెంపర్’లో నటించకపోవడానికి కారణమిదే
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్’ తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర అంశం మీకోసం.. -
Oy: ‘ఓయ్’ టైటిల్ అర్థమిదే.. మీరు గమనించారా?
సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన చిత్రం ‘ఓయ్!’. ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారో మీకు తెలుసా?
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల గగ్గోలు.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ