Bhola Shankar: ఆ విషయంలో ‘బిల్లా’, ‘భోళా శంకర్‌’ ఒకటే: మెహర్‌ రమేశ్‌

చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను రమేశ్‌ చెప్పారు.

Published : 26 Oct 2022 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మేకింగ్‌ విషయంలో ‘బిల్లా’ (Billa), ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) సినిమాలు ఒకటే అని దర్శకుడు మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) అన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. చిరంజీవి (Chiranjeevi) హీరోగా మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘భోళా శంకర్‌’. ఈ సినిమా ప్రయాణం గురించి వివరిస్తూ.. ‘‘చిరంజీవి సినిమాలోక్లి రీ ఎంట్రీ ఇవ్వటం చాలా సంతోషాన్నిచ్చింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వేదాళం’ సినిమా ఆయనతో రీమేక్‌ చేస్తే బాగుంటుందని ఆ సమయంలోనే అనిపించింది. నాలుగేళ్ల నుంచి ఈ కథతో ప్రయాణిస్తున్నా. గతంలో ప్రభాస్‌ హీరోగా నేను తెరకెక్కించిన ‘బిల్లా’.. అజిత్‌ ‘బిల్లా’ చిత్రానికి రీమేక్‌. వేదాళం కూడా అజిత్‌ సినిమానే. మక్కీకి మక్కీ దించకుండా థీమ్‌ను మాత్రమే తీసుకుని ‘బిల్లా’ను నా స్టైల్‌లో తీశా. ‘భోళా శంకర్‌’ విషయంలోనూ అదే చేస్తున్నా. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అని చెప్పారు.

‘వీర కన్నడిగ’ అనే కన్నడ చిత్రంతో దర్శకుడిగా మారారు మెహర్‌ రమేశ్‌. ఆయన తెరకెక్కించిన తొలి తెలుగు సినిమా ‘కంత్రి’. తర్వాత ‘బిల్లా’, ‘శక్తి’, ‘షాడో’ చిత్రాలను తెరకెక్కించారు. సుమారు పదేళ్లకు ‘భోళా శంకర్‌’తో మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. అన్నాచెల్లి అనుబంధం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. తమన్నా కథానాయిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని