vikram: మురుగదాస్‌ దర్శకత్వంలో విక్రమ్‌?

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న కథానాయకుడు విక్రమ్‌. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది.

Published : 18 Apr 2022 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న కథానాయకుడు విక్రమ్‌. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. పాత్రలు, కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తున్నా విక్రమ్‌కు సరైన హిట్‌ మాత్రం పడటం లేదు. ఈ క్రమంలో ఆయన నటించబోయే తదుపరి చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కమర్షియల్‌ కథలకు సందేశం జోడించి తెరకెక్కించటంలో తమిళ దర్శకుడు మురుగదాస్‌ సిద్ధహస్తుడు. ఈ క్రమంలో వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. మురుగదాస్‌ చెప్పిన లైన్‌ విక్రమ్‌కు నచ్చిందట. భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించే సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించనుందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులపై మురుగదాస్‌ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మరోవైపు విక్రమ్‌ నటిస్తున్న ‘కోబ్రా’ మే 28న విడుదల కానుండగా, మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని