Nag Ashwin: నాగ్‌ అశ్విన్‌ పాత ఫొటో.. మోక్షజ్ఞ కొత్త స్టిల్‌: వైరల్‌

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అవేంటో చూసేయండి..

Published : 01 Jul 2024 23:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కల్కి 2898 ఏడీ’ (kalki 2898 ad) ఘన విజయంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (nag ashwin) పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. సినిమా చూసిన వారంతా అద్భుతాన్ని తెరకెక్కించారంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ డైరెక్టర్‌కు సంబంధించిన ప్రతిదీ నెట్టింట వైరల్‌ అవుతోంది. గతంలో.. ఓ వేడుకలో అశ్విన్‌ దిగిన ఫొటో ఎక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో హీరో విజయ్‌ దేవరకొండ (vijay deverakonda) కూడా ఉన్నారు. ఈ ఇద్దరు స్నేహితులనే సంగతి తెలిసిందే. ‘కల్కి’ సహా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన మూడు సినిమాల్లోనూ విజయ్‌ భాగమవడం విశేషం.

బాలకృష్ణ తనయుడి లుక్‌ అదుర్స్‌

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Mokshagna Teja) కొత్త స్టిల్‌ ఒకటి వైరల్‌గా మారింది. టీ షర్ట్‌, కళ్లద్దాలు ధరించి అతడు స్టైల్‌గా దిగిన ఫొటోపై నందమూరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ‘హీరో లుక్‌’, ‘బాలయ్యకు తగ్గ వారసుడు’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తెరంగేట్రం చేస్తాడని భావిస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని