Rashmika: రష్మికను బ్యాన్ చేస్తే ఆ పరిశ్రమకే నష్టం: దర్శకుడి కామెంట్స్ వైరల్
నటి రష్మికపై కన్నడ చిత్రపరిశ్రమలో నెలకొన్న వివాదం గురించి స్పందించారు దర్శకుడు నాగశేఖర్. రష్మికపై నిషేధం విధిస్తే ఆ పరిశ్రమకే నష్టమని ఆయన అన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: కన్నడలో రష్మికపై (Rashmika) బ్యాన్ విధిస్తే.. ఆ పరిశ్రమకే నష్టమని దర్శకుడు నాగశేఖర్ (Nagashekar) అన్నారు. తన తదుపరి చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రష్మిక వివాదంపై స్పందించారు. ‘‘ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. ‘సంజు వెడ్స్ గీత’ చిత్రాన్ని నేను తెరకెక్కించినప్పుడు అందులో కొంతమంది నటీనటులకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు వాళ్లు కెరీర్లో పెద్ద స్టార్స్ అయ్యారు. నా సినిమా తర్వాత వాళ్లు నన్ను గుర్తుపెట్టుకుంటారా? లేదా? అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం. నేను దాన్ని పట్టించుకోను. నా తదుపరి సినిమాపైనే ఫోకస్ పెడతా. ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం ఎక్కడో ఒకచోట బాధకు లోనవుతాం’’ అని అన్నారు.
అనంతరం రష్మికపై కన్నడ పరిశ్రమ బ్యాన్ విధించనుందంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘దాని గురించి నాకు తెలియదు. ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఈ విషయాన్ని నేను సపోర్ట్ చేయను’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోన్న రష్మిక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ‘కిర్రిక్‌పార్టీ’తో తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణసంస్థ పేరు చెప్పడానికి ఆసక్తి కనబర్చలేదు. ఈ వీడియో బయటకు వచ్చిన సమయంలో అది చూసిన కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నటిగా నువ్వు ఈస్థాయిలో ఉన్నావంటే దానికి కారణం పరంవా నిర్మాణ సంస్థే. రక్షిత్ శెట్టికి చెందిన ఆ సంస్థ లేకపోతే నువ్వు నటివి అయ్యేదానివి కాదు. అలాంటి సంస్థ పేరు చెప్పడానికి ఎందుకంత పొగరు’’ అని మండిపడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Nellore: మేనమామ అత్యాచారయత్నం.. 5 నెలలు మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక
-
World News
Flight: 13 గంటలు ప్రయాణించి టేకాఫ్ అయిన చోటే ల్యాండింగ్..
-
Crime News
Crime News: రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల దారుణహత్య
-
Crime News
కుమార్తెలను చదివించేందుకు అప్పులు.. తీర్చలేక అమ్మ బలవన్మరణం
-
India News
బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా..
-
Ap-top-news News
Taraka Ratna: తారకరత్నకు మరిన్ని వైద్య పరీక్షలు