Jailer2: ‘జైలర్‌-2’కు అడ్వాన్స్‌ అందుకున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌.. ఎంతంటే!

ఇటీవల విడుదలై విజయాన్ని అందుకున్న సినిమా ‘జైలర్‌’ (Jailer). దీని సీక్వెల్‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు హట్‌ టాపిక్‌గా మారింది. 

Published : 27 Sep 2023 15:35 IST

చెన్నై: రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌’. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకున్న ఈ సినిమా రికార్డులు సృష్టించింది. రజనీకాంత్‌ కెరీర్‌లోనే మంచి కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం గతంలో తెలిపిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌కు సంబంధించి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ అడ్వాన్స్‌ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సినీ విశ్లేషకులు ట్వీట్లు పెడుతున్నారు. దీని ప్రకారం ‘జైలర్‌2’ కోసం దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూ.55 కోట్లు అడ్వాన్స్‌ అందుకున్నారు. ఈ సీక్వెల్‌ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందనుంది. ‘జైలర్‌’కు తన మ్యూజిక్‌తో ఊర్రూతలూగించిన అనిరుధ్ ఈ సీక్వెల్‌కు కూడా స్వరాలు అందించన్నారు. రజనీకాంత్‌ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వాటితో పాటే ఈ సీక్వెల్‌ను కూడా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో తలైవా అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆగస్టు 10న ప్రేక్షకుల ముందు వచ్చిన ‘జైలర్‌’ రూ.700 కోట్లు వసూళ్లు చేసింది. రజనీకాంత్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. దీంతో దీని సీక్వెల్‌లో (Jailer2) ఆయన ఎలా కనిపించనున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’ చూడలేదు.. ఎందుకంటే: సీనియర్‌ నటుడు వ్యాఖ్యలు

ప్రస్తుతం టీజే జ్ఞానవేల్‌ (TG Gnanavel) దర్శకత్వంలో రజనీకాంత్‌ ఓ సినిమా (Thalaiva 170) చేస్తున్నారు. లైకా ప్రోడక్షన్స్‌పై ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కూడా అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ఓ సినిమా చేయనున్నారు. అలాగే రజనీకాంత్ నటించిన ‘లాల్‌ సలాం’ త్వరలోనే విడుదల కానుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని