‘కేజీఎఫ్‌2’ టీజర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌..

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. జనవరి 8న హీరో యష్‌ జన్మదినం సందర్భంగా టీజర్‌ విడుదల చేస్తామని ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన విషయం తెలిసిందే.

Updated : 04 Jan 2021 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాకీభాయ్‌ సామ్రాజ్యం తలుపులు తెరుచుకునేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. జనవరి 8న హీరో యశ్‌ జన్మదినం సందర్భంగా టీజర్‌ విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఇప్పటికే ప్రకటించారు. అప్పటి నుంచి టీజర్‌ కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. కాగా.. సినిమాలోని ఓ స్టిల్‌ను అభిమానులతో పంచుకుంటూ.. ‘రాకీభాయ్‌ తన సామ్రాజ్యపు తలుపు తెరవడానికి కౌంట్‌డౌన్‌ ఇప్పుడు మొదలైంది’ అంటూ డైరెక్టర్‌ రాసుకొచ్చారు.

కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ మార్చిలో నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం ఆగస్టులో పునఃప్రారంభమై తాజాగా విడుదలకు సిద్ధమైంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా వచ్చి భారీ విజయం సాధించిన ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. పాన్‌ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ‘అధీర’గా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, రవీనా టాండన్‌ కీలకపాత్రల్లో నటించారు.

ఇదీ చదవండి..

నేను భారతీయుడినే.. ఇదిగో రుజువు: దిల్జిత్‌

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని