Sardar: రంగస్థల నటుడు గూఢచారిగా.. ఆ సంఘటనే ‘సర్దార్’కు స్ఫూర్తి
కార్తి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సర్దార్’. ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానున్న సందర్భంగా చిత్ర దర్శకుడు పి.ఎస్. మిత్రన్ పలు విశేషాలు పంచుకున్నారు.
హైదరాబాద్: ‘అభిమన్యుడు’, ‘హీరో’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ (PS Mithran). ఈ రెండు సినిమాలతో కోలీవుడ్, టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆయన ఇప్పుడు ‘సర్దార్’ (Sardar)తో రాబోతున్నారు. కార్తి (Karthi) హీరోగా మిత్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మిత్రన్ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
* ‘సర్దార్’ ఎలా మొదలైంది?
మిత్రన్: నా తొలి చిత్రం ‘అభిమన్యుడు’ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ‘సర్దార్’ కథాలోచన వచ్చింది. ఆ తర్వాత నా రచయితల్లోని ఒకరితో చర్చించి పూర్తి కథ డెవలప్ చేశా. నిర్మాత లక్ష్మణ్‌కు ఈ కథ చెబితే ఆయన కార్తిని కలవమన్నారు. నిర్మాత చెప్పినట్టే కార్తిని కలిసి, స్టోరీ వినిపించా. ఆయనకు బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించారు.
* ఇది పీరియాడికల్ చిత్రమా?
మిత్రన్: అవును. వర్తమానం, 1980లో నడిచే కథ ఇది. 1980లో ‘ఇండియన్ ఇంటెలిజెన్స్’ బృందంలోని ఒకరిని గూఢచారిగా తయారు చేయాలని ప్రయత్నించింది. కానీ, అది సాధ్యపడలేదు. ఆ సైన్యంలో పని చేసే వ్యక్తి గూఢచారిగా మారాలంటే అతనికి నటించటం రావాలి, మారువేషాలు వేయటం తెలియాలి. అది ఎంతో కష్టం కాబట్టి రంగస్థల నటుడినే గూఢచారిగా మార్చారు. ఆ సంఘటన ‘సర్దార్’కు ఓ స్ఫూర్తి. దాన్నుంచి ఈ కథను అల్లుకున్నా.
* కార్తి ఎలా కనిపిస్తారు?
మిత్రన్: ఈ సినిమాలో కార్తి పోషించిన పాత్ర కొత్త అనుభూతి పంచుతుంది. తండ్రీకొడుకులుగా ఆయన నటన అద్భుతం. ఇందులోని ఓ పాత్ర.. తన గురించి ప్రపంచానికి తెలియకూడదనుకుంటుంది. మరో పాత్ర పబ్లిసిటీని కోరుకుంటుంది. విభిన్నమైన ఈ పాత్రల్లో కార్తి ఒదిగిపోయారు. ఆయన నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. దాన్ని ‘సర్దార్’ కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది.
* ఈ సినిమాలో వినోదం ఉంటుందా?
మిత్రన్: ‘సర్దార్’లో యాక్షన్ మాత్రమే కాదు ప్రేమ, కామెడీ, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలూ ఉన్నాయి. ఇది ఫుల్ మీల్స్‌లాంటి చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. రాశీ ఖన్నా, రజిషా విజయన్ పాత్రలు కథలో చాలా కీలకం. లైలా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
* దీపావళి పోటీలో నిలవటం ఎలా అనిపిస్తుంది?
మిత్రన్: శివకార్తికేయన్ హీరోగా గతంలో నేను తెరకెక్కించిన ‘హీరో’.. కార్తి సినిమాతో పోటీ పడింది. ఇప్పుడు కార్తి హీరోగా నేను తీసిన ‘సర్దార్’.. శివకార్తికేయన్ ‘ప్రిన్స్’తో కలిసి దీపావళి బరిలో నిలవటం విశేషం. ఈ సినిమాలేకాదు దీపావళి కానుకగా విడుదలయ్యే చిత్రాలన్నీ విజయవంతంకావాలని కోరుకుంటున్నా. మా సినిమా తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన నిర్మాణ సంస్థ అది.
* తదుపరి సినిమా విశేషాలు?
మిత్రన్: అఖిల్‌తో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతానికి నా దృష్టంతా ‘సర్దార్’ విడుదలపైనే ఉంది. ఇది రిలీజైన తర్వాత కొత్త సినిమాల పనులు మొదలుపెడతా.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్‌ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు