Updated : 20/09/2020 15:13 IST

నిద్రపోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చేది: పూరీ

ఏ కల లేనివాడే 8 గంటలకు పడుకుంటాడు

హైదరాబాద్‌: రాత్రిపూట నిద్రమేలుకునే వారికి తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. తనకు కూడా చిన్నప్పుడు నిద్రపట్టేది కాదని, ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టేవని వివరించారు. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన ‘నైట్‌’ అనే అంశంపై మాట్లాడారు. రాత్రి పూట పనులు చేయడం, ఆలోచించడం గురించి ముచ్చటించారు.

‘శ్రీశ్రీ గారు చెప్పారు.. ‘వేళ కాని వేళలలో, లేని పోని వాంఛలతో, దారి కాని దారులలో కానరాని కాంక్షలతో, దేనికొరకు పదేపదే దేవులాడుతావు.. ఆలసించి, అలమటించి పాకులాడతావు శ్రీనివాసరావు..’ అని. చిన్నప్పుడు దీన్ని చదవగానే నా కోసమే రాశారు అనుకున్నా. లేనిపోని వాంఛలు.. ప్రతి రాత్రి నిద్రపోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చేది. ఆలోచనలు ఆగేవి కాదు.. ఏం పీకుతామో తెలియదు కానీ మనందరికీ ఇలానే నిద్ర పట్టదు. కానీ, తెలివైన వారంతా ఇలానే ఎక్కువ సేపు రాత్రిపూట మేలుకుని ఉంటారని సర్వేలో తేలింది. హమ్మయ్యా.. మనం కూడా తెలివైన వాళ్లమేనన్న చిన్న సంతృప్తి. పగలు కంటే రాత్రి చాలా విలువైంది. మన చుట్టూ ఉన్న మైండ్స్‌ గాఢ నిద్రలో ఉంటాయి. మనం మేలుకుని ఉంటాం. మనం మనతో కూర్చునే అవకాశం అప్పుడే దొరుకుతుంది. నిజమైన కల ఎప్పుడూ నిన్ను నిద్రపోనీదు. ఏ కల లేనివాడే ఎనిమిది గంటలకు పడుకుంటాడు. మరి మనం ఎందుకు నిద్రపోతాం’

‘ఓ విశ్వవిద్యాలయం వెయ్యి మంది టీనేజర్స్‌ను చెక్‌ చేస్తే.. రాత్రిపూట మేలుకుని ఉండే వారే చురుగ్గా ఉన్నట్లు తెలిసింది. లేటుగా పడుకుని, లేటుగా లేచే వారి బ్యాంకు అకౌంట్స్‌లో డబ్బు ఎక్కువ ఉందట. పల్లెటూర్లు త్వరగా పడుకుంటాయి.. కానీ, పట్టణాల్లోని వ్యక్తులు లేటుగా పడుకుంటారు. ఎన్నో కోట్ల మంది ప్రతిరోజూ రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచేస్తుంటారు. డ్యాన్స్‌ బార్లు, వీధి నాటకాలు, నైట్‌ బజార్లు.. పగటిపూట చూసిన అదే ప్రపంచం రాత్రుల్లో మరోలా ఉంటుంది. లేట్‌నైట్‌ పీపుల్‌కే క్రియేటీవ్‌ సొల్యూషన్స్‌ దొరుకుతాయి. కొన్ని వృత్తులకు రాత్రే సరైన సమయం. ఒక సంగీత కళాకారుడు రాత్రే ట్యూన్స్‌‌ కంపోజ్‌ చేస్తాడు, ఓ నిపుణుడు వెన్నెలను చూస్తూ సముద్రం ఒడ్డున కూర్చుని ఆలోచిస్తుంటాడు. మంచి స్నేహితులతో రాత్రుల్లో ముచ్చట్లు చాలా బాగుంటాయి. ఏ రాత్రి అందంగా ముగుస్తుందో అదే గొప్ప రోజు.. జీవితంలో మర్చిపోని రాత్రులు కొన్నే ఉంటాయి. వీకెండ్స్‌ను అందమైన రాత్రులుగా మార్చి మన ఖాతాల్లోకి వేసుకోవాలి’ అని పూరీ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని