Radheshyam: ‘రాధేశ్యామ్‌’పై నమ్మకమది..ప్రభాస్‌ మీ హృదయాల్లో డ్యాన్స్‌ చేస్తాడు: రాధాకృష్ణ

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు.

Published : 12 Jan 2022 11:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. పూజాహెగ్డే కథానాయిక. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. సినీ ప్రియులు, ప్రభాస్‌ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు రాధాకృష్ణ ట్విటర్‌లో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆ విశేషాలివీ..

* ‘రాధేశ్యామ్‌’ విషయంలో మీ నమ్మకం ఏంటి?

రాధాకృష్ణ: కథ, ప్రభాస్‌పైనే నమ్మకంగా ఉన్నా.

* ‘రాధేశ్యామ్‌’ గురించి ఒక్క మాటలో..

రాధాకృష్ణ: ప్రేమ.

* ఇతర ప్రేమ కథలకు, ‘రాధేశ్యామ్‌’కు తేడా ఏంటి? మేం కొత్తగా ఏం చూడబోతున్నాం?

రాధాకృష్ణ: నిజమైన ప్రేమ.

* ఈ సినిమా తొలికాపీ చూసిన తర్వాత మీకొచ్చిన ప్రశంస?

రాధాకృష్ణ: నేను బాగా తీశానని నన్ను నేనే ప్రశంసించుకున్నా.

* ప్రభాస్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?

రాధాకృష్ణ: ఒక్క నవ్వుతో బాధలన్నీ పోగొట్టి ఈ ప్రపంచాన్ని ప్రశాంతంగా మార్చగలడు.

* కృష్ణంరాజు గురించి ఒక్క మాటలో?

రాధాకృష్ణ: పరమహంస.

* కథానాయిక పూజాహెగ్డే గురించి చెప్పండి..

రాధాకృష్ణ: పూజా అద్భుతమైన నటి. తన బెస్ట్‌ ఇవ్వటంలో ఎప్పుడూ పోటీ పడుతుంటుంది.

* ఈ చిత్రంలో ప్రభాస్‌ లుక్స్‌ ఎలా ఉంటాయి?

రాధాకృష్ణ: మీరు ఇప్పటివరకూ చూసినవాటి కంటే అద్భుతంగా ఉంటాయి.

* ఈ సినిమాలో ప్రభాస్‌ డ్యాన్స్‌ ఎలా ఉంటుంది?

రాధాకృష్ణ: ప్రభాస్‌ మీ హృదయాల్లో డ్యాన్స్‌ చేస్తాడు.

* మీపై వచ్చే మీమ్స్‌ చూస్తారా? వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది?

రాధాకృష్ణ: సోషల్‌ మీడియాలో వచ్చే మీమ్స్‌ చూస్తుంటా. అవి నా ఒత్తిడిని తగ్గిస్తుంటాయి.

* ఇది పాన్‌ ఇండియా చిత్రం కదా. మీరు ఉత్తరాది (హిందీ) వారికి రిప్లై ఇవ్వరు. ఇలానే కానివ్వండి.. (నవ్వుతూ)

రాధాకృష్ణ: ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు బ్రదర్‌. థియేటర్లలో త్వరలోనే కలుద్దాం.

* యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మాతలతో మీ అనుబంధం?

రాధాకృష్ణ: తోడబుట్టిన వారికంటే ఎక్కువ.

* చిత్రీకరణకు సంబంధించి మీరు మరిచిపోలేని రోజు?

రాధాకృష్ణ: ప్రతిరోజూ.

* ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు?

రాధాకృష్ణ: పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత.

* మీరు లవ్‌లో ఫెయిల్‌ అయ్యారా? ఒకవేళ కాకపోతే ఏమైనా సలహాలు ఇవ్వండి.

రాధాకృష్ణ: నేను అన్నీ పాస్‌ అయిపోయా. అదే సమస్య (నవ్వుతూ..)

* మీ తదుపరి చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు?

రాధాకృష్ణ: అతి త్వరలోనే..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని