Raghavendra Rao: ఆ‘దర్శకేంద్రుడు’ స్పెషల్‌.. ‘వెండితెర వేల్పులు’!

ఆయనో తెలుగు సినీ మహర్షి. పాటకు పట్టాభిషేకం చేసిన రాజార్షి. ఆయన పాటలు సన్నజాజులు, తెరపై విరబూసిన విరజాజులు. ఆయన ప్రస్థానమే ఓ చరిత్ర.

Published : 27 Mar 2022 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆయనో తెలుగు సినీ మహర్షి. పాటకు పట్టాభిషేకం చేసిన రాజర్షి. ఆయన పాటలు సన్నజాజులు. తెరపై విరబూసిన విరజాజులు. ఆయన ప్రస్థానమే ఓ చరిత్ర. ప్రేక్షకుల పల్స్‌ తెలిసిన ఇంద్రజాలికుడు.. బాక్సాఫీసు బద్దలు కొట్టిన దర్శకేంద్రుడు. ఆయనెవరో కాదు కోవెలమూడి రాఘవేంద్రరావు. వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, ఎందరో నటులను స్టార్‌గా మార్చిన ఆయన గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకునేందుకు ఈవారం ‘వెండితెర వేల్పులు’ కార్యక్రమం సిద్ధమైంది. ఆ‘దర్శకేంద్రుడి’ స్పెషల్‌ ఎపిసోడ్‌ ‘ఈటీవీ’ వార్త ఛానళ్లలో ఈ ఆదివారం ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 6.30 లకు, రాత్రి 10.30 గం.లకు ప్రసారం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని