RRR: చరణ్, ఎన్టీఆర్‌ల మధ్య తేడా అదే.. ఆ ఒక్క సీన్ అత్యద్భుతం: రాజమౌళి
‘‘రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. కానీ, ఆ విషయం తనకు తెలియదు. ఎన్టీఆర్ కూడా అద్భుతమైన నటుడు. ఆ విషయం తనకు తెలుసు’’ అని ‘ఆర్ఆర్ఆర్’ కథానాయకుల గురించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. కానీ, ఆ విషయం తనకు తెలియదు. ఎన్టీఆర్ కూడా అద్భుతమైన నటుడు. ఆ విషయం తనకు తెలుసు’’ అని ‘ఆర్ఆర్ఆర్’ కథానాయకుల గురించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ ఇద్దరు హీరోలతో ఆయన తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ప్రచారాన్ని ముంబయిలో ఇటీవల నిర్వహించారు. చరణ్, తారక్‌ల మధ్య ఉన్న తేడా గురించి రాజమౌళి మాట్లాడారు. సల్మాన్‌ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ వేడుకకు సంబంధించిన వీడియోల్ని చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వివరాలివీ..
‘‘ఓ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తికాగానే రామ్ చరణ్‌ని హగ్ చేసుకుని బాగా చేశావు అని కితాబిస్తా. ‘బాగుందా సర్.. మీకు నచ్చిందా సర్.. మీకు నచ్చితే ఓకే సర్’ అని అంటాడు. అదే తారక్ విషయానికొస్తే.. తన నటన చూసి బాగుందని చెప్పేలోపు ‘జక్కన్నా..’ అదరగొట్టేశా కదా అంటాడు. తనపై తనకున్న విశ్వాసం అది. ఇలాంటి ఇద్దరు గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. సినిమా కోసం వారిద్దరినీ విపరీతంగా కష్టపెట్టా. చిత్రీకరణ తొలిరోజు నుంచే శ్రమపెట్టా. పరిచయ సన్నివేశం కోసం తారక్‌ను పాదరక్షలు లేకుండా అడవిలో పరిగెత్తించా. చరణ్‌ను వేలమంది సభ్యుల మధ్య దుమ్ములో నిలబెట్టా. అతనికి చెమట, రక్తం కారుతున్నా సరే వదిలిపెట్టలేదు. నా కెరీర్లో ది బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఇది. చిత్రీకరణ రెండోరోజు బ్రిడ్జి సన్నివేశం తెరకెక్కించాం. దీని కోసం వీరిద్దరూ తాళ్ల సాయంతో 60 అడుగులు గాల్లోకి జంప్ చేశారు. 5- 6 డిగ్రీల ఉష్టోగ్రత వద్ద 1200 మంది ఆర్టిస్టులతో 65 రాత్రులు ఇంటర్వెల్ సీన్ షూట్ చేశాం. పాటలు, క్లైమాక్స్ కోసం వారు అంతే కష్టపడ్డారు. ఈ చిత్రంలో అత్యద్భుతమైన సన్నివేశం ఒకటుంది. టీజర్, ట్రైలర్లో దాన్ని చూపించలేదు. సినిమాలో ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ శరీరంలోని ప్రతి నరం బిగుసుకుపోతుంది. చరణ్, తారక్ అలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చారు’’ అని రాజమౌళి అన్నారు.
రాజమౌళికి సినిమానే ప్రపంచం..
‘‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ఫెంటాస్టిక్. ఈ చిత్రం కోసం చరణ్, తారక్ చాలా హార్డ్‌వర్క్ చేశారు. ఈ ఇద్దరితో కలిసి సినిమా తీసేందుకు రాజమౌళి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని, ఇందులో అలియాభట్ నటిస్తుందని తెలియగానే ఆనందించా. రాజమౌళి చాలా ప్రతిభావంతుడు. రాజమౌళితోపాటు ఆయన కుటుంబ సభ్యులకూ తిండి, నిద్ర, శ్వాస.. అన్నీ సినిమానే’’ అని సల్మాన్‌ఖాన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డు సృష్టించింది. అదేంటంటే? -
Fahadh Faasil: రాజమౌళి సమర్పణ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫహద్ ఫాజిల్ మూవీస్
Fahadh Faasil: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. -
upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో థ్రిల్లింగ్ కంటెంట్
గత వారం బాక్సాఫీస్ వద్ద పదికి పైగా చిన్న చిత్రాలు సందడి చేయగా, ఈ వారం కూడా అదే పంథా కొనసాగనుంది. థియేటర్లో మరికొన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి. -
Priyadarshi: ఆ చిత్రానికి, ‘ఓం భీమ్ బుష్’కి పోలిక ఉండదు: ప్రియదర్శి
తన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు ప్రియదర్శి.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య