Ram Gopal Varma: రీమేక్‌ల వల్ల ఉపయోగం లేదు.. బాలీవుడ్‌పై ఆర్జీవీ వరుస ట్వీట్లు

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా వేదికగా తరచూ తన అభిప్రాయాల్ని పంచుకుంటుంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం.. బాలీవుడ్‌పై వరుస ట్వీట్లు చేశారు.

Published : 27 Apr 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా వేదికగా తరచూ తన అభిప్రాయాల్ని పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం.. బాలీవుడ్‌పై వరుస ట్వీట్లు చేశారు. ఇటీవల విడుదలైన ‘జెర్సీ’ (తెలుగు సినిమా జెర్సీ రీమేక్‌) గురించి చెబుతూ.. రీమేక్‌ల సినిమా నిర్మాణం గురించి తనదైన శైలిలో విశ్లేషించారు. ‘‘తెలుగులో నాని నటించిన ‘జెర్సీ’ని హిందీలోకి డబ్‌ చేసి, విడుదల చేస్తే నిర్మాతలకు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుంది. అదే సినిమాను రీమేక్‌ చేసేందుకు రూ.100కోట్ల వ్యయంతోపాటు సమయం, చిత్ర బృందం పడిన కష్టం వృథా అవుతుంది. అందుకే ఓ సినిమాను రీమేక్‌ చేసే బదులు డబ్బింగ్‌ చేసి, రిలీజ్‌ చేయడం మంచిది. కథ, దక్షిణాది హీరోలను హిందీ ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పటికీ ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌ 2’ ఘన విజయం అందుకోవడంతో మంచి కంటెంట్‌ ఉన్న ఏ దక్షిణాది చిత్రాన్ని అక్కడ రీమేక్‌ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపట్లేదు. డబ్బింగ్‌తో నేరుగా అక్కడ విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో సూపర్‌హిట్‌ సినిమాలను ఎలా తెరకెక్కించాలో అనే సందేహంలో బాలీవుడ్‌ ఉంది. తెలుగు, కన్నడ చిత్రాలు హిందీ సినిమాకు కరోనా వైరస్‌లా మారాయి. బాలీవుడ్‌ ఓ వ్యాక్సిన్‌తో వస్తుందని ఆశిస్తున్నా’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని