Updated : 05 Aug 2022 14:50 IST

Singham 3: ‘సింగం 3’ ఏప్రిల్‌లో..

దర్శకుడు రోహిత్‌ శెట్టి - కథానాయకుడు అజయ్‌ దేవ్‌గణ్‌ కలయిలకలో వచ్చిన ‘సింగం’ సిరీస్‌ చిత్రాలు బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన సంగతి   తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మూడో భాగం రానుందా? అంటే ఔననే అంటున్నాడు దర్శకుడు రోహిత్‌ శెట్టి. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘సర్కస్‌’ షూటింగ్‌ పూర్తై, నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఇది ప్రేక్షకుల ముందుకు రాగానే వచ్చే ఏడాది ‘సింగం 3’ పట్టాలెక్కనుందని రోహిత్‌శెట్టి తెలిపారు. ‘ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ సిద్ధమైంది. ఎప్పట్లాగే ఇందులో అజయ్‌   దేవ్‌గణ్‌ కథానాయకుడిగా నటిస్తారు. ఆయన నటిస్తున్న ప్రాజెక్టులు  పూర్తవగానే ఏప్రిల్‌లో షూటింగ్‌ మొదలుపెడతాం. ఇది ఇంతవరకు ఎవరూ చిత్రీకరించని అతిపెద్ద పోలీసు చిత్రం అవుతుంది. అజయ్‌కి జోడీగా ఎవరు నటిస్తారనే విషయం త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నారు. మరోవైపు ఆయన దర్శకత్వం వహించిన వెబ్‌సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ శరవేగంగా ముస్తాబవుతోంది. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts