Pawan Kalyan: ఓ అభిమానిగా పవన్‌తో సినిమా తీస్తున్నా .. రీమేక్‌ ఖరారు చేసిన సముద్రఖని

తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వినోదాయ సీతాం’లో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పష్టత వచ్చింది.

Published : 13 May 2022 02:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వినోదాయ సీతాం’లో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా స్పష్టత వచ్చింది. మాతృక చిత్ర దర్శక- నటుడు సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో పవన్‌తో రీమేక్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. తాను పవన్‌ కల్యాణ్‌ అభిమానినని, తనలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంబంధిత పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో తంబి రామయ్య, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్‌లో మార్పులు చేయనున్నారని సమాచారం. పవన్‌తోపాటు సాయి ధరమ్‌తేజ్‌ ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయని ఇటీవల ప్రచారం సాగింది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. వైవిధ్య పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన సముద్రఖని తెలుగు హీరోలతో గతంలో ‘శంభో శివ శంభో’, ‘జెండా పై కపిరాజు’ తదితర చిత్రాలు తెరకెక్కించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని