Spirit: మళ్లీ ట్రెండింగ్‌లో ప్రభాస్‌ ‘స్పిరిట్‌’.. డైరెక్టర్‌ అలా చెప్పడం వల్లే!

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిస్తోన్న ‘యానిమల్‌’ చిత్రంతో బిజీగా ఉన్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. తదుపరి ప్రభాస్‌తో చేయనున్న సినిమా గురించి మాట్లాడారు.

Published : 17 Feb 2023 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్‌’. గతేడాదే ఈ సినిమా ప్రకటన వెలువడగా ఇంకా చిత్రీకరణ ప్రారంభంకాలేదు. ఎప్పుడెప్పుడు స్టార్ట్‌ చేస్తారా? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో చిన్న అప్‌డేట్‌ వచ్చినప్పుడల్లా  #Spirit హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. సందీప్‌ తాజాగా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడడంతో అది మరోసారి ట్విటర్‌ ట్రెండింగ్‌ జాబితాలోకి వచ్చింది.

సందీప్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. తన తదుపరి చిత్రాల గురించి ప్రస్తావనరాగా.. ‘‘యానిమల్‌’ తర్వాత ‘స్పిరిట్‌’ చేయనున్నా. ప్రభాస్‌ అన్న అంటే అంచనాలు భారీగా ఉంటాయి కదా. వాటిని అందుకుంటానని ఆశిస్తున్నా’’ అని ఆయన అన్నారు. సంబంధిత క్లిప్పింగ్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. ప్రాజెక్టుపై సందీప్‌ గట్టి నమ్మకంతో ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందిన సందీప్‌.. తర్వాత అదే చిత్రాన్ని ‘కబీర్‌సింగ్‌’గా హిందీలోకి రీమేక్‌ చేశారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ‘యానిమల్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ ప్రారంభిస్తారు. ఇందులో ప్రభాస్‌ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ కెరీర్‌లోనే తొలిసారి ఖాకీ దుస్తులు వేసుకోబోతున్నారు. ‘ఆదిపురుష్‌’తో ఈ ఏడాది జూన్‌ 16న ప్రేక్షకులను పలకరించినున్న ప్రభాస్‌ .. ‘సలార్‌’ (Salaar), ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌), మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని