Shankar: ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది: ‘గేమ్‌ ఛేంజర్‌’పై శంకర్‌ కామెంట్స్‌

రామ్‌చరణ్‌ హీరోగా తాను తెరకెక్కిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు శంకర్‌.

Updated : 11 Jul 2024 11:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌ (Game Changer). ఈ సినిమా గురించి డైరెక్టర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన మరో చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

‘‘నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆమేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ‘గేమ్‌ ఛేంజర్‌’తో నా కల నెరవేరుతోంది. కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైంది’’ అని పేర్కొన్నారు. సంబంధిత విజువల్స్‌ను రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ నెట్టింట పోస్ట్‌ చేస్తూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ మాస్‌ ఫిల్మ్‌ అంటూ ఫైర్‌ ఎమోజీలు జత చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేశారని సమాచారం. కియారా అడ్వాణి హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. హీరో పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. దాదాపు 10 రోజుల షూటింగ్‌ మిగిలిఉందని శంకర్‌ ఇటీవల ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఫైనల్‌ ఎడిటింగ్‌ అయ్యాక రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని తెలిపారు.

కమల్ హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ శుక్రవారం బాక్సాఫీసు ముందుకురానుంది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కి సీక్వెల్‌ ఇది. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రధారులు. తొలి భాగం కథ ఒక రాష్ట్రం చుట్టూనే తిరగ్గా.. పార్ట్‌ 2 కథ పలు రాష్ట్రాల చుట్టూ తిరుగుతుంది. సినిమా రన్‌టైమ్‌: 3: 04 గంటలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని