Shankar: శంకర్‌ ఇంట పెళ్లి సందడి

ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఆదివారం వేడుకగా జరగనుంది. రోహిత్‌ దామోదరన్‌ అనే క్రికెటర్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. రోహిత్‌ ప్రస్తుతం తమిళనాడు....

Published : 27 Jun 2021 09:35 IST

చెన్నై: ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఆదివారం వేడుకగా జరగనుంది. రోహిత్‌ దామోదరన్‌ అనే క్రికెటర్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. రోహిత్‌ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. రోహిత్‌ తండ్రి దామోదరన్‌ చెన్నైలో ప్రముఖ పారిశ్రామిక వేత్త. మదురై పాంతర్స్‌ క్రికెట్‌ టీమ్‌కి ఆయన యజమాని. మరోవైపు ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. కొవిడ్‌ నేపథ్యంలో కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది ఆప్తుల సమక్షంలో మహాబలిపురంలో వీరి వివాహం జరగనుంది.

శంకర్‌ ప్రస్తుతం ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌, ‘రామ్‌చరణ్‌ -15’ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రీ ప్రొడెక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. రామ్‌చరణ్‌తో తెరకెక్కనున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘అపరిచితుడు’ చిత్రాన్ని రణ్‌వీర్‌ సింగ్‌తో హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు శంకర్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని