Shankar: ‘జేమ్స్‌ బాండ్‌’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై శంకర్‌ కామెంట్స్‌

‘భారతీయుడు 2’ ప్రమోషన్‌లో భాగంగా శంకర్‌ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

Published : 02 Jul 2024 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు దర్శకుడు శంకర్‌. ఆయన దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో శంకర్‌ (Director Shankar) అభిమానులతో ముచ్చటించారు.

షారుక్‌ ఖాన్‌తో సినిమా తీస్తారా?

శంకర్‌: కచ్చితంగా తీస్తాను. మంచి స్క్రిప్ట్‌ ఉంటే ఆయనతో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాను.

ఫ్యూచర్‌లో ఎలాంటి సినిమాలు చేస్తారు?

శంకర్‌: చాలా ఐడియాలు ఉన్నాయి. ‘జేమ్స్‌ బాండ్‌’ తరహా చిత్రాలు తీయాలి. అలాగే హిస్టారికల్‌, సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు చేస్తాను. ఇవన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలే. వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్‌లకు ప్రాధాన్యం ఉండే మూవీలు. కచ్చితంగా ఇందులో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తాను. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయి.  

శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ ఎందుకు క్రియేట్‌ చేయలేదు?

శంకర్‌: గతంలోనూ దీనికి సమాధానం చెప్పాను. ‘రోబో’ సమయంలో ఆ ఆలోచన వచ్చింది. నా అసిస్టెంట్‌ డైరెక్టర్లకు, కుటుంబసభ్యులకు, స్నేహితులకు దాన్ని వివరించా. వాళ్లు పాజిటివ్‌గా స్పందించలేదు. దీంతో నా ఆలోచన సరైనది కాదనిపించింది. అందుకే సైలెంట్‌ అయ్యాను. వాళ్లు సపోర్ట్‌ చేసుంటే క్రియేట్‌ చేసేవాడిని. 

‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్‌ కటౌట్‌కు అదిరిపోయే సీన్స్‌

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో మల్టీస్టారర్‌ తీస్తారా?

శంకర్‌: వీళ్లిద్దరితో ‘2.ఓ’ తీయాలనుకున్నా. కానీ, ఆ సమయంలో కమల్‌ హాసన్‌ బిజీగా ఉండడంతో కుదరలేదు.

మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, ఇప్పటికీ వచ్చిన పరిశ్రమలో వచ్చిన మార్పులు ఏంటి?

శంకర్‌: నేను సినీ రంగంలోకి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా ఎక్కువైంది. ఎలాంటి సినిమా తీయాలన్నా టెక్నాలజీ అందుబాటులో ఉంది. దాంతో అద్భుతాలు చేయచ్చు. మంచి కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. 

సినీ రంగంపై ఏఐ ప్రభావం ఉంటుందంటారా?

శంకర్‌: ఏఐ (కృత్రిమ మేధ) కంటే మనిషి ఆలోచనలు చాలా శక్తిమంతమైనవి. ఇప్పుడే కాదు.. కొన్ని ఏళ్ల తర్వాత కూడా మనుషుల ఆలోచనలు ఏఐ కంటే ముందుంటాయి. నా స్క్రిప్ట్‌కు తగిన టెక్నాలజీని ఉపయోగించుకుంటాను. కానీ, టెక్నాలజీకి అనుగుణంగా స్క్రిప్ట్‌ను మార్చుకోను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని